న్యూజీలాండ్ (New Zealand) టాపార్డర్ బ్యార్లు దంచి కొట్టారు. భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి పరుగులు రాబట్టారు. వారు దంచి కొట్టడం చూస్తే.. 200 స్కోర్ చేస్తారేమో అని భారత క్రికెట్ ఫ్యాన్స్ భయపడ్డారు. అయితే టీమ్ ఇండియా (Team India) బౌలర్లు చివర్లో కట్టడి చేయడంతో కేవలం 153 పరుగులకే పరిమితం అయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్‌కు శుభారంభం లభించింది. మార్టిన్ గప్తిల్ (Martin Guptil), డారిల్ మిచెల్ (Daryl Mitchell) కలసి ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. గుప్తిల్ తొలి బంతి నుంచే చెలరేగిపోయాడు. బౌండరీలు, సిక్సులతో బంతిని నలువైపులా పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. ఈ క్రమంలో దూకుడు మీద ఉన్న మార్టిన్ గప్తిల్ (31) దీపక్ చాహర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మార్క్ చాప్‌మన్ కూడా ధాటిగా ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ కూడా వరుస బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
అయితే మార్క్ చాప్‌మన్ (21) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే డారిల్ మిచెల్ (31) అరంగేట్రం బౌలర్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. 11 ఓవర్లలో 90 పరుగులు చేసిన కివీస్ దూకుడు మీద కనిపించడంతో 200 పరుగులు చేస్తుందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత టీమ్ ఇండియా బౌలర్లు కివీస్ బౌలర్లను కట్టడి చేశారు. టిమ్ సిఫెర్ట్ (13) రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే మరో ఎండ్‌లో గ్లెన్ ఫిలిప్ చెలరేగిపోయాడు. భారీ సిక్సర్లతో కివీస్ స్కోర్‌ను పరుగులు పెట్టించాడు. కేవలం 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అయితే గ్లెన్ ఫిలిప్స్ (34) హర్షల్ పటేల్ బౌలింగ్‌లో గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు.
INNINGS BREAK!
Fine performance with the ball from #TeamIndia! ? ?
2⃣ wickets on debut for @HarshalPatel23
1⃣ wicket each for @ashwinravi99, @akshar2026, @BhuviOfficial & @deepak_chahar9 #INDvNZ @Paytm
Scorecard ▶️ https://t.co/9m3WflcL1Y pic.twitter.com/iz8ogYly5i
— BCCI (@BCCI) November 19, 2021
ఆ తర్వాత టీమ్ ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పరుగులు రాకుండా జాగ్రత్తగా బంతులు విసిరారు. టీమ్ ఇండియా బౌలింగ్‌కు కివీస్ బ్యాటర్లు పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. జేమ్స్ నీషమ్ (3) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత మిచెల్ సాంట్నర్ (8), అడమ్ మిల్నే (5) పరుగులు చేయలేక విఫలం అవడంతో కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ 2 వికెట్లు, భువీ, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తలా ఒక వికెట్ తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs newzealand, Team India