Viral Photo : "క్రికెట్ కన్నా అంతకు మించి మా మధ్య స్నేహం ఉంది " ..వైరల్ పిక్ పై కేన్ మామ రిప్లై అదుర్స్..

Photo Credit : Twitter

Viral Photo : సౌథాంప్టన్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ ఘనవిజయం సాధించి ట్రోఫీని సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత జరిగిన ఓ సంఘటన మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

  • Share this:
    సౌథాంప్టన్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ ఘనవిజయం సాధించి ట్రోఫీని సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత జరిగిన ఓ సంఘటన మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. మొదటి సారి ఐసీసీ ట్రోఫి గెలిచిన ఆనందంలో కివీస్ జట్టు కెప్టెన్‌ విలియమ్సన్‌ కోహ్లీని ఆలింగనం చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేన్ అలానే కొద్దిసేపు విరాట్ భుజంపై తన తలను ఆనించి ఉంచాడు. అయితే నెట్టింట్లో అదో పెద్ద సంచలనంలా మారిపోయింది. తాజాగా దీనిపై కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌ స్పందించాడు. టీమిండియా సారథి, నేను మంచి మిత్రులమేనని, చాలా ఏళ్లుగా మాస్నేహం కొనసాగుతుందని వెల్లడించాడు. బరిలో ప్రత్యర్థులమే కావొచ్చు.. మ్యాచ్‌ అనంతరం స్నేహితులమని, అంతర్జాతీయ క్రికెట్‌లో ఫ్రెండ్‌ షిప్‌లు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నాడు.

    కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. " భారతదేశానికి వ్యతిరేకంగా మేం ఆడుతున్నప్పుడు, ఎక్కడ ఉన్నా కూడా కష్టమైన సవాలే అవుతుంది. టీమిండియాకు వ్యతిరేకంగా మ్యాచ్ గెలవడం అంటే చాలా గొప్ప విషయం. టీమ్ ఇండియా ఆటగాళ్ళు క్రికెట్‌లో ఎప్పుడూ కూడా ఒక బెంచ్ మార్కును నిర్దేశిస్తారు. వారి జట్టులో వారి దేశంలో క్రికెట్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారనే విషయం కనిపిస్తుంది. వారిపై గెలవడంతో నేను భావోద్వేగానికి లోనయ్యాను " అని చెప్పారు విలియమ్సన్.


    అండర్-19 నుంచి కోహ్లీ, విరాట్ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. అలాగే జాతీయ జట్టులోకి ఎంపికైన తరువాత ఇద్దరూ కీలక ఆటగాళ్లుగా మారి, సారథులుగా టీం ను ముందుడి నడిపిస్తున్నారు. తమ హయాంలో దేశానికి ఒక్క ఐసీసీ ట్రోఫీనైనా అందించాలని ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లుగా ఎదిగారు. కానీ, ఐసీసీ టోర్నీల్లో మాత్రం బోల్తాపడుతున్నారు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో కోహ్లీసేన ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. అలాగే 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో కివీస్ పై ఓడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్ టీం సైతం 2015, 2019 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఓడిపోయారు. దీంతో అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని సాధించాలని బరిలోకి దిగారు. కివీస్ టీం విశ్వ విజేతగా నిలిచి, తన కల నెరవేర్చుకుంది. దీంతో కేన్ విలియమ్సన్‌..కోహ్లీని వద్దకు వచ్చి గట్టిగా హత్తుకుని భుజంపై వాలిపోయాడు.
    Published by:Sridhar Reddy
    First published: