NEW ZEALAND PULL OUT OF U19 WORLD CUP OVER QUARANTINE RESTRICTIONS TEAM INDIA IN GROUP B JNK
U19 World Cup: వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న న్యూజీలాండ్.. కారణం ఇదే.. గ్రూప్ బిలో టీమ్ ఇండియా
అండర్ 19 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న న్యూజీలాండ్ (PC: New Zealand Cricket)
ICC U19 World Cup: ఐసీసీ పురుషుల అండర్ 19 వరల్డ్ కప్ వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో కరేబియన్ దీవుల్లో నిర్వహించనున్నట్లు ఐసీసీ తెలిపింది. టీమ్ ఇండియా గ్రూప్ బిలో ఉండగా.. ఈ సారి న్యూజీలాండ్ ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నది.
ఐసీసీ (ICC) పురుషుల అండర్ 19 వరల్డ్ కప్‌కు (Under 19 World Cup) కరేబియన్ దీవులు (Caribbean Islands) ఆతిథ్యం ఇవ్వనున్నది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో టైటిల్ కోసం 14 దేశాలు తలపడనున్నాయి. అండర్ 19 వరల్డ్ కప్ చరిత్రలో ఈ టోర్నీ వెస్టిండీస్‌లో జరగడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అండర్ 19 కప్ కరేబియన్ దీవుల్లో జరగక పోవడంతో దాని నిర్వహణపై క్రికెట్ వెస్టిండీస్ చాలా ఆసక్తిగ ఉన్నది. ఈ టోర్నమెంట్ నిర్వహణపై ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ మాట్లాడుతూ.. 'ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ ఎప్పుడూ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే భవిష్యత్ క్రికెట్ స్టార్లు ఇక్కడి నుంచే పుట్టుకొని వస్తారు. అందుకే దీని నిర్వహణ చాలా ఉత్సాహంగా ఉంటుంది. టీనేజ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఇతర దేశాల క్రికెటర్లతో ఆడే అవకాశం దీని వల్ల కలుగుతుంది. అందువల్ల వారికి మంచి అనుభూతి లభిస్తుంది. వెస్టిండీస్‌లో జరుగబోతున్న ఈ మెగా టోర్నీకి అన్ని జట్లు మంచిగా సన్నద్దం అవుతున్నాయి. ప్రత్యేక ప్రణాళికలతో సిద్దం అవుతున్నాయి' అని ఆయన అన్నారు.
అండర్ 19 వరల్డ్ కప్ కోసం కరేబియన్ దీవుల్లోని నాలుగు దేశాల్లో ఉనన 10 క్రికెట్ స్టేడియంలలో ఈ పోటీలు జరుగనున్నాయి. అంటిగ్వా అండ్ బార్బుడా, గయానా, సెయింట్ కిట్స్ అండ్ నెవీస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టీమ్ ఇండియా ఈ సారి గ్రూప్ బిలో ఉన్నది. ఈ గ్రూప్‌లో ఇండియాతో పాటు ఐర్లాండ్, సౌతాఫ్రికా, ఉగాండ దేశాలు ఉన్నాయి. ఇండియా జనవరి 15న సౌతాఫ్రికాతో గయానాలో. జనవరి 19న ఐర్లాండ్‌తో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో, జనవరి 22న ఉగాండాతో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో తలపడనున్నది. ఇక గ్రూప్ ఏలో ఇంగ్లాండ్, కెనడా, యూఏఈతో పాటు డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్, గ్రూప్ సిలో పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, జింబాబ్వే, పపువా అండ్ న్యూ గినియా, గ్రూప్ డిలో ఆతిథ్య వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక, స్కాట్లాండ్ దేశాలు ఉన్నాయి.
వాస్తవానికి స్కాట్లాండ్ జట్టును గ్రూప్ డిలో చివరి క్షణంలో చేర్చారు. ఆ గ్రూప్‌లో ఉన్న న్యూజీలాండ్ జట్టు అండర్ 19 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నది. న్యూజీలాండ్‌లో కఠినమైన క్వారంటైన్ నిబందనలు అమలు అవుతున్నాయి. టీనేజర్లు బయటి దేశాలకు వెళ్లి తిరిగి వస్తే తప్పకుండా క్వారంటైన్లో ఉండాలి. దీనికి చాలా మంది క్రికెటర్లు వ్యతిరేకత చూపించారు. దీంతో న్యూజీలాండ్ ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది.దీంతో ఆఖరి క్షణంలో న్యూజీలాండ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు అవకాశం కల్పించారు.
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.