IND vs NZ : తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..

IND vs NZ : ఇండియా, న్యూజిలాండ్ మధ్య కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో కివీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 0-5తో జోరుమీదున్న టీమిండియా ఈ సిరీస్‌పైనా కన్నేసింది.

news18-telugu
Updated: February 5, 2020, 7:24 AM IST
IND vs NZ : తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..
టాస్ గెలిచిన కివీస్
  • Share this:
IND vs NZ : టీ20 సిరీస్‌లో నయా చరిత్ర సృష్టించిన టీమిండియా మరో ప్రతిష్ఠాత్మక పోరుకు సిద్ధమైంది. న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న కోహ్లీ సేన.. 3 వన్డేల సిరీస్‌ను ప్రారంభిస్తోంది. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 0-5తో జోరుమీదున్న టీమిండియా ఈ సిరీస్‌పైనా కన్నేసింది. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లకు చోటిచ్చింది. వీరిద్దరు ఒకేసారి ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నారు.

టీమిండియా జట్టు ఇదే..

మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శార్ధుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, బుమ్రా

కివీస్ జట్టు ఇదే..
గప్తిల్, నికోల్స్, బ్లండెల్, రాస్ టేలర్, లాథమ్, నీషామ్, గ్రాండ్‌హోమ్, షాంట్‌నర్, సోదీ, సౌథీ, బెనెట్
First published: February 5, 2020, 7:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading