హోమ్ /వార్తలు /క్రీడలు /

Chirs Cairns : చావు బతుకుల మధ్య న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్.. ఆ తప్పు వల్ల స్టార్ క్రికెటర్ నుంచి క్లీనర్ గా మారాడు..

Chirs Cairns : చావు బతుకుల మధ్య న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్.. ఆ తప్పు వల్ల స్టార్ క్రికెటర్ నుంచి క్లీనర్ గా మారాడు..

Chirs Cairns

Chirs Cairns

Chirs Cairns : న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ అప్పట్లో ఓ సంచలనం. మైదానంలో అతనో ఒక 'సూపర్‌ స్టార్‌'లా కనిపించేవాడు. జీనియస్‌లా బ్యాటింగ్‌ చేస్తూ.. నాణ్యమైన బౌలర్‌ను తలపించేలా బంతులు విసిరేవాడు.

  న్యూజిలాండ్‌ (New Zealand) మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ (Chirs Cairns) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తీవ్ర అనారోగ్యంతో గతవారం ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో గల ఓ ఆస్పత్రిలో చేరిన కెయిన్స్‌ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు ఓ మీడియా రిపోర్టు వెల్లడించింది. ప్రస్తుతం అతడికి వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందిస్తున్నారు. కెయిన్స్‌ శరీరం చికిత్సకు సహకరించట్లేదని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రపంచ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన కెయిన్స్‌ 90వ దశకంలో న్యూజిలాండ్‌ తరఫున 62 టెస్టులు, 215 వన్డేలు ఆడాడు.మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కారణంగా కెరీర్ దూరం చేసుకున్న కెయిన్స్‌.. గతంలో కామెంటరీ కూడా చెప్పాడు. స్కై స్పోర్ట్స్ కోసం అతడు వ్యాఖ్యానం చేశాడు. గుండె లోపల నీరు చేరడంతో క్రిస్‌ కెయిన్స్‌ తీవ్ర అనారోగ్యానికి గురి అవ్వగా.. అతని కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం సిడ్నీలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతన్ని పరిశీలించి పలు ఆపరేషన్లు నిర్వహించినా.. సరిగ్గా స్పందించడం లేదు. దీంతో కెయిన్స్‌కు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సిడ్నీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కెయిన్స్‌ను తీసుకెళ్లి చికిత్స అందిచనున్నారు. న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ తర్వగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

  న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ అప్పట్లో ఓ సంచలనం. మైదానంలో అతనో ఒక 'సూపర్‌ స్టార్‌'లా కనిపించేవాడు. జీనియస్‌లా బ్యాటింగ్‌ చేస్తూ.. నాణ్యమైన బౌలర్‌ను తలపించేలా బంతులు విసిరేవాడు. అత్యున్నత శిఖరాలను అధిరోహించాల్సిన అలాంటి వ్యక్తి చేజేతులా భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. ఐపీఎల్ లో కెయిన్స్‌ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని అప్పటి ఛైర్మన్ లలిత్ మోడీ ఆరోపించారు. ఆపై ఐపీఎల్ వేలం నుంచి క్రెయిన్స్ పేరును కూడా తొలగించారు.

  ఇది కూడా చదవండి : కవలల జంటనే పెళ్లి చేసుకోవాలనుకున్న ట్విన్ సిస్టర్స్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. 

  జీవనం కోసం క్రికెట్‌కు సంబంధం లేని రంగాల్లో కూడా పనిచేశాడు. కెయిన్స్‌ 2017లో బస్టాండుల్లో బస్సులను కడుగుతూ జీవనం సాగించాడు. ట్రక్కులు నడుపుతూ.. బస్‌ షెల్టర్లను క్లీన్‌ చేశాడు. ప్రతిరోజు కష్టపడేవాడు. అలా బస్టాండుల్లో గంటకు 17 డాలర్లు సంపాదించేవాడు. కూడు.. గూడుకు పోను మిగిలినవి మొత్తం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో న్యాయ ఖర్చుల కోసం వినియోగించాడు. క్రికెట్ తర్వాత దొరికిన పనల్లా చేశాడు. ఇప్పడు అనారోగ్య సమస్యలతో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

  51 ఏళ్ల క్రిస్‌ కెయిన్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో కెయిన్స్‌ కివీస్‌ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు పడగొట్టాడు. 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు తీశాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్‌ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, క్రిస్‌ కెయిన్స్ సోదరుడు క్రిస్‌ హారిస్‌ కూడా కివీస్‌ తరపున మంచి క్రికెటర్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. మొత్తానికి లెజెండ్ అవ్వాల్సిన క్రిస్ కెయిన్స్ ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో ఉండటంతో పలువురు మాజీ క్రికెటర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IPL, New Zealand, Sports

  ఉత్తమ కథలు