Home /News /sports /

NEW ZEALAND FORMER CRICKETER ROSS TAYLOR REVEALS RACIAL INSENSITIVITY IN NEW ZEALAND CRICKET SJN

Ross Taylor : పైన పటారం.. లోన లొటారం అంటే ఇదే కాబోలు.. ఆదర్శంగా కనిపించే కివీస్ జట్టులో చీకటి కోణమా.?

PC : TWITTER

PC : TWITTER

Ross Taylor : ఒక్క మాటలో చెప్పాలంటే క్రికెట్ లో న్యూజిలాండ్ కు ఉన్న పర్యాయ పదాలు ఇవి. అయితే ఇటువంటి జట్టుపై ఒక మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్ చేశాడు. చేసింది వేరే దేశపు ప్లేయర్ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. ఈ ఆరోపణలు చేసింది స్వయానా కివీస్ మాజీ ప్లేయరే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
ఓటమిని కూడా నవ్వుతూ స్వీకరిస్తారు.. హై టెన్షన్ మ్యాచ్ ల్లోనూ ఎక్కడా ప్రత్యర్థి ప్లేయర్లతో గొడవకు తిగరు.. అన్ని జట్లతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. ప్రతి ఏటా క్రీడా స్ఫూర్తి అవార్డును పొందుతారు. (PC : TWITTER)


ఒక్క మాటలో చెప్పాలంటే క్రికెట్ లో న్యూజిలాండ్ కు ఉన్న పర్యాయ పదాలు ఇవి. అయితే ఇటువంటి జట్టుపై ఒక మాజీ ప్లేయర్ సంచలన కామెంట్స్ చేశాడు. చేసింది వేరే దేశపు ప్లేయర్ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. ఈ ఆరోపణలు చేసింది స్వయానా కివీస్ మాజీ ప్లేయరే. (PC : TWITTER)


రాస్ టేలర్.. అంతర్జాతీయ క్రికెట్ లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్. ఈ ఏడాది ఆరంభంలో అతడు క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. (PC : TWITTER)


అయితే తాజాగా తన ఆటోబయోగ్రఫీ ద్వారా రాస్ టేలర్ న్యూజిలాండ్‌ క్రికెట్‌పై ఒక బాంబు పేల్చాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో తోటి ఆటగాళ్లచే తాను వివక్ష ఎదుర్కొన్నట్లు "రాస్‌ టేలర్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌"లో సుధీర్ఘంగా పేర్కొన్నాడు. టేలర్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం కివీస్‌ క్రికెట్‌లో సంచలనం కలిగిస్తోంది. ఈ మాటలతో కివీస్ కు ఉన్న క్రీడాస్ఫూర్తి ట్యాగ్ లైన్ ఒట్టిదేనా అనిపిస్తుంది. (PC : TWITTER)


’నా 16 ఏళ్ల క్రికెట్ లో అంతా సవ్యంగానే గడిచిందని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ, డ్రెస్సింగ్ రూంలో ఎవరికీ తెలియని వివక్షను నేను ఎదుర్కొన్నా. సొంత జట్టు ప్లేయర్లే నా మొహం గురించి తరచూ కామెంట్స్ చేసేవారు. నీ మొహంలో ఆసియా మూలాలు ఉన్నాయి. పొరపాటున నువ్వు మా దేశంలో క్రికెట్ ఆడుతున్నావ్‘ అంటూ పేర్కొనేవారు అని రాస్ టేలర్ తెలిపాడు. (PC : TWITTER)


అంతేకాకుండా తనను ’నువ్వు సగం మంచోడివి.. మిగతా సగం ఏంటనేది నువ్వే నిర్ణయించుకో‘ అని హేళనగా మాట్లాడేవారని టేలర్ తెలిపాడు. ఆరంభంలో ఈ కామెంట్స్ పై సరదాగా అంటున్నారేమో అనుకునే వాడిని.. కాలం గడిచినా తనను అలానే అంటుండేసరికి వివక్షకు గురయ్యా అని అర్థం అయ్యింది. (PC : TWITTER)


న్యూజిలాండ్ క్రికెట్ లో వివక్ష కంటికి కనిపించదు. అంతా తెరవెనుకే జరుగుతుంది. అంటూ రాస్ టేలర్ న్యూజిలాండ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆఖరికి న్యూజిలాండ్ జట్టులో కూడా వివక్ష ఉందా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. (PC : TWITTER)
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Kane Williamson, New Zealand, Rishabh Pant, Rohit sharma, Team India

తదుపరి వార్తలు