Home /News /sports /

NEW YORK METS BASEBALL TEAM PLAYER PETE ALONSO BREAKS HIS BAT HALF AFTER GETTING OUT SJN

Viarl Video : వీడెవడో బాహుబలికి బాబులా ఉన్నాడు.. బ్యాట్ ను కట్టెపుల్లలా ఎలా విరిచాడో చూడండి

PC : TWITTER

PC : TWITTER

Base Ball : ఇండియా (India)లో క్రికెట్ కు ఎంత పాపులారిటీ ఉంటుందో.. అమెరికా (USA)లో కూడా బేస్ బాల్ కు అంతే పాపులారిటీ ఉంటుంది. ఎన్ బీఏ (NBA), అమెరికన్ ఫుట్ బాల్ (American Football), బేస్ బాల్ (Base ball) గేమ్స్ ను అమెరికన్స్ విపరీతంగా ఇష్టపడతారు.

ఇంకా చదవండి ...
Base Ball : ఇండియా (India)లో క్రికెట్ కు ఎంత పాపులారిటీ ఉంటుందో.. అమెరికా (USA)లో కూడా బేస్ బాల్ కు అంతే పాపులారిటీ ఉంటుంది. ఎన్ బీఏ (NBA), అమెరికన్ ఫుట్ బాల్ (American Football), బేస్ బాల్ (Base ball) గేమ్స్ ను అమెరికన్స్ విపరీతంగా ఇష్టపడతారు. మన దేశంలో ఐపీఎల్ ఎలా జరుగుతుందో అమెరికాలో కూడా బేస్ బాల్ లీగ్ జరుగుతుంది. క్రికెట్ కు బేస్ బాల్ కు దగ్గర పోలికలు ఉన్నట్లు అనిపించినా.. రూల్స్ చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. తాజాగా బేస్ బాల్ ఆటలో ఒక ప్లేయర్ కు ఎక్కడలేని కోపం వచ్చింది. హోమ్ రన్ కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకున్నానే కోపంతో చేతిలో ఉన్న బ్యాట్ ను రెండు ముక్కలుగా విరిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి  : ఈ టీమిండియా ప్లేయర్స్ పేరుకే హీరోలు..బాధ్యత విషయంలో జీరోలు..కొంచెం అన్నా ఉండాలి?

ఆటగాళ్లకు కోపం రావడం సహజమే.. క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఇలా ప్రతి ఆటలోనూ ఏదో ఒక సమయంలో ప్లేయర్లు తమ సహనాన్ని కోల్పోయి దురుసుగా ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. టెన్నిస్ లో అయితే ప్లేయర్స్ రాకెట్ ను నేలకేసి బాది దాన్ని విరగొట్టి కోపాన్ని తీర్చుకుంటారు. తాజాగా న్యూయార్క్ మెట్స్ ప్లేయర్ పీట్ అలోన్సో మ్యాచ్ మధ్యలో కోపాన్ని గురై.. తన చేతిలో ఉన్న బ్యాట్ ను కట్టెపుల్లను విరిచేసినట్లు విరిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాడికి పీట్ అలోన్సో బాహుబలిలా తప్పక అనిపిస్తాడు.



న్యూయార్క్‌ మెట్స్‌, మియామి మార్లిన్స్‌ మధ్య బేస్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూయార్క్‌ మెట్స్‌ 5-3 తేడాతో మియామి మార్లిన్స్‌పై విజయం అందుకుంది. అయితే మ్యాచ్‌ విజయం కంటే న్యూయార్క్‌ మెట్స్‌ స్టార్‌ పీట్ అలోన్సో చర్య ఎక్కువ హైలైట్‌ అయింది. 8వ ఇన్నింగ్స్‌లో పీట్‌ అలోన్సో షాట్‌ ఆడే ప్రయత్నంలో ఔట్‌ అయ్యాడు. కీలక సమయంలో ఔటయ్యానన్న బాధ పీట్‌ అలోన్సో కళ్లలో స్పష్టంగా కనిపించింది. అంతే ఉగ్ర రూపం దాల్చిన పీట్‌.. ఏదో కట్టె పుల్లను విరిచేసిట్లు బ్యాట్‌ను తొడ భాగంపై బాది విరిచేశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: America, Cricket, India, Sports, USA, Viral, Viral Video, Viral Videos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు