హోమ్ /వార్తలు /క్రీడలు /

Indian cricket: కొత్త ఏడాది.. సరికొత్త సవాళ్లు.. 2023 వన్డే వరల్డ్‌ కప్‌తో పాటు.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే!

Indian cricket: కొత్త ఏడాది.. సరికొత్త సవాళ్లు.. 2023 వన్డే వరల్డ్‌ కప్‌తో పాటు.. టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే!

Team India

Team India

Indian cricket: భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో బలమైన ప్రదర్శనతో 2022ని ముగించింది. కొత్త సంవత్సరం కూడా టెస్టుల్లో సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో ఉంది. WTC ఫైనల్‌తో పాటు స్వదేశంలోనే జరగనున్న వన్డే ప్రపంచ కప్‌కు ఇండియా సిద్ధమవుతోంది.  ఈ సమయంలో 2023లో టీమ్‌ ఇండియా షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ముగిసిన 2022వ సంవత్సరంలో టీమిండియా (Team India) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రధాన టోర్నీలలో స్థాయికి తగ్గ పోటీని ఇవ్వలేక వెనుదిరిగింది. గత సంవత్సరం దక్షిణాఫ్రికా (South Africa) టెస్ట్ సిరీస్ ఓటమి తో ప్రారంభమైంది. దీని తర్వాత విరాట్ కోహ్లీ(Virat Kohli) సుదీర్ఘ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వైదొలిగాడు. ద్వైపాక్షిక సిరీస్‌లలో ఇండియా ప్రదర్శనలు ఎప్పటిలాగే బలంగా ఉన్నప్పటికీ, మేజర్‌ ఈవెంట్‌లలో విఫలమైంది. 2022 T20 వరల్డ్‌కప్‌ సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలోని ఇండియన్‌ టీమ్‌ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

* రెండో స్థానం నిలబెట్టుకున్న ఇండియా

సీనియర్ ఆటగాళ్లకు గాయాలు, విశ్రాంతి కారణంగా 2022లో టీ20 ఫార్మాట్‌లలోకి ఎక్కువ మంది అరంగేట్రం చేశారు. చాలా మంది కెప్టెన్‌లు కనిపించారు. సంవత్సరం ముగిసే సమయానికి శ్రీలంక T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా సెలక్ట్‌ అయ్యాడు. జట్టులో మొదటి మూడు స్థానాల్లో బ్యాటింగ్‌ చేసే కేఎల్‌ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 సిరీస్‌కు ఎంపిక కాలేదు.

టెస్టుల్లో బంగ్లాదేశ్‌ సిరీస్‌ను 2-0 క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టెస్టుల్లో రెండో స్థానాన్ని టీమ్‌ ఇండియా నిలబెట్టుకుంది. భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో బలమైన ప్రదర్శనతో 2022ని ముగించింది. కొత్త సంవత్సరం కూడా టెస్టుల్లో సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో ఉంది. WTC ఫైనల్‌తో పాటు స్వదేశంలోనే జరగనున్న వన్డే ప్రపంచ కప్‌కు ఇండియా సిద్ధమవుతోంది. ఈ సమయంలో 2023లో టీమ్‌ ఇండియా షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం.

* జనవరి 2023: భారత్ vs శ్రీలంక (హోమ్)

జనవరి 3న 1వ T20I- ముంబై

జనవరి 5న 2వ T20I- పూణె

జనవరి 7న 3వ T20I- రాజ్‌కోట్

జనవరి 10న 1వ వన్డే- గౌహతి

జనవరి 12న 2వ వన్డే - కోల్‌కతా

జనవరి 15న 3వ వన్డే - తిరువనంతపురం

* జనవరి/ఫిబ్రవరి 2023: భారత్ v న్యూజిలాండ్ (హోమ్)

జనవరి 18న 1వ వన్డే- హైదరాబాద్

జనవరి 21న 2వ వన్డే- రాయ్‌పూర్

జనవరి 24న 3వ వన్డే- ఇండోర్

జనవరి 27న 1వ T20I- రాంచీ

జనవరి 29న 2వ T20I- లక్నో

ఫిబ్రవరి 1న 3వ T20I- అహ్మదాబాద్

* ఫిబ్రవరి/మార్చి 2023: భారత్ v ఆస్ట్రేలియా (హోమ్)

ఫిబ్రవరి 9- 13 వరకు 1వ టెస్ట్- నాగ్‌పూర్

ఫిబ్రవరి 17-21 వరకు 2వ టెస్ట్- ఢిల్లీ

మార్చి 1-5 వరకు 3వ టెస్ట్- ధర్మశాల

మార్చి 9-13 వరకు 4వ టెస్ట్- అహ్మదాబాద్

మార్చి 17న 1వ వన్డే - ముంబై

మార్చి 19న 2వ వన్డే - విశాఖపట్నం

మార్చి 22న 3వ వన్డే- చెన్నై

* మార్చి- మే 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్

* టీ20 లీగ్ 2023 ఎడిషన్ షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరిలో ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

* జూన్ 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్

* జులై/ఆగస్ట్‌ 2023: వెస్టిండీస్ వర్సెస్ ఇండియా (విదేశాల్లో)

ఈ సిరీస్‌లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఉంటాయి. షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

* సెప్టెంబర్ 2023: ఆసియా కప్ 2023 (విదేశాల్లో)

కాంటినెంటల్ టోర్నమెంట్‌కు పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే BCCI, PCB మధ్య విభేదాలు ఆతిథ్య జట్టు మార్పుకు దారితీయవచ్చు.

* అక్టోబర్ 2023: భారత్ vs ఆస్ట్రేలియా (హోమ్)

భారత్‌లో జరిగే ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది.

* అక్టోబర్/నవంబర్ 2023: ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్

మొదటిసారిగా 2023లో జరిగే ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌కు భారతదేశం ఏకైక ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నమెంట్‌లో ఇప్పటికే 1983, 2011 ఎడిషన్‌లను గెలుచుకున్న భారత్ మూడో టైటిల్‌ను సాధించాలనే కసితో ఉంది.

* నవంబర్/డిసెంబర్ 2023: ఆస్ట్రేలియా v భారత్

ఐదు టీ20ల ఆడేందుకు ఆస్ట్రేలియా ఏడాదిలో మూడోసారి భారత్‌కు రానుంది.

* డిసెంబర్ 2023: భారత్ v సౌతాఫ్రికా (విదేశాల్లో)

దక్షిణాఫ్రికా పర్యటనతో టీమ్ ఇండియా ఏడాదిని ముగించనుంది.

First published:

Tags: Bcci, Cricket, Rohit sharma, Team India, World cup, WTC Final

ఉత్తమ కథలు