హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Record : ముంబై చిన్నోడి మెరుపు శతకం.. టి20 మ్యాచ్ లో ఏకంగా 501 పరుగులు నమోదు.. ఎక్కడంటే?

T20 World Record : ముంబై చిన్నోడి మెరుపు శతకం.. టి20 మ్యాచ్ లో ఏకంగా 501 పరుగులు నమోదు.. ఎక్కడంటే?

PC : TWITTER

PC : TWITTER

T20 World Record : టి20 ఫార్మాట్ బ్యాటర్లకు స్వర్గధామం లాంటిది. కొన్ని సార్లు బౌలర్లు మెరుస్తున్నా అది అరుదుగా మాత్రమే జరుగుతుంది. సగటున 10 మ్యాచ్ ల్లో 8 సార్లు బ్యాటర్ల ఆధిపత్యమే నడుస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

T20 World Record : టి20 ఫార్మాట్ బ్యాటర్లకు స్వర్గధామం లాంటిది. కొన్ని సార్లు బౌలర్లు మెరుస్తున్నా అది అరుదుగా మాత్రమే జరుగుతుంది. సగటున 10 మ్యాచ్ ల్లో 8 సార్లు బ్యాటర్ల ఆధిపత్యమే నడుస్తుంది. ఇక తాజాగా దక్షిణాఫ్రికా (South Africa) దేశవాళి టోర్నీ అయిన CSA T20 Challenge టోర్నీ ప్రపంచ రికార్డుకు వేదికైంది. టైటాన్స్ (Titans), నైట్స్ (Knights) మధ్య జరిగిన పోరులో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కలిపి మొత్తం 40 ఓవర్లలో ఏకంగా  501 పరుగులు నమోదయ్యాయి. ఒక టి20 మ్యాచ్ లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. గతంలో న్యూజిలాండ్ (New Zealand) వేదికగా జరిగిన సూపర్ స్మాష్ 2016-17 టి20 టోర్నీలో 497 పరుగులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఆ రికార్డును టైటాన్స్, నైట్స్ మ్యాచ్ బద్దలు కొట్టింది.

ఇది కూడా చదవండి : టీమిండియాలో ఆ ఇద్దరి ఖేల్ ఖతం.. టీ20 ప్రపంచకప్ తర్వాత వదిలించుకోవడానికి బీసీసీఐ రెడీ!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 271 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్ డివాల్డ్ బ్రెవీస్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 57 బంతుల్లోనే 13 సిక్సర్లు, 13 ఫోర్లతో 162 పరుగులు చేశాడు. టి20 ఫార్మాట్ లో ఒక జట్టు చేసిన అత్యధిక పరుగుల జాబితాలో ఈ ఇన్నింగ్స్ నాలుగో స్థానంలో నిలిచింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నైట్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 230 పరుగులు చేసింది. దాంతో టైటాన్స్ 41 పరుగుల తేడాతో నెగ్గింది.

ఇక మ్యాచ్ లో బేబీ ఏబీ డీవిలియర్స్ డివాల్డ్ బ్రెవీస్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ లో 162 పరుగులు చేయడం ద్వారా టి20 ఫార్మాట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన మూడో బ్యాటర్ గా నిలిచాడు. తొలి స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. అతడు 2013 ఐపీఎల్ లో పుణే వారియర్స్ పై 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక 2018లో జరిగిన అంతర్జాతీయ టి20 మ్యాచ్ లో అరోన్ ఫించ్ జింబాబ్వేపై 172 పరుగులు చేశాడు. ఇది రెండో స్థానంలో ఉంది. అయితే టి20ల్లో అత్యంత వేగవంతమైన 150 పరుగులను చేసిన ప్లేయర్ గా బ్రెవీస్ రికార్డు సాధించాడు. అతడు కేవలం 52 బంతుల్లోనే ఈ మార్కును అందుకున్నాడు. గతంలో గేల్ ఈ మార్కును 53 బంతుల్లో అందుకున్నారు.

First published:

Tags: Cricket, Mumbai Indians, South Africa, T20

ఉత్తమ కథలు