Home /News /sports /

NEW CONFLICT MORGAN GOT CODE LANGUAGE MESSAGES DURING MATCH JNK

IPL 2021: కొత్త వివాదం.. కేకేఆర్ ఏమిటీ తొండాట? డగౌట్ నుంచి మోర్గాన్‌కు కోడ్ రూపంలో మెసేజెస్

మోర్గాన్‌కు కోడ్‌ లాంగ్వేజ్ సలహాలు [PC: iplt20.com]

మోర్గాన్‌కు కోడ్‌ లాంగ్వేజ్ సలహాలు [PC: iplt20.com]

    ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఢిల్లీ వేదికగా రేపటి నుంచి మ్యాచ్‌లు జరుగుతాయి. నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings), కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) మధ్య జరిగిన మ్యాచ్ లో స్కోర్ గేమ్‌గా మారిపోయింది. చెన్నైలోని చేపాక్ పిచ్ లాగే మొతేరా కూడా స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తున్నది. దీంతో కెప్టెన్లు పదే పదే వ్యూహాలను మార్చాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌లో జరిగిన సంఘటన వివాదానికి తెర తీసింది. మ్యాచ్ జరిగే సమయంలో కోచింగ్ సిబ్బంది నుంచి ఎలాంటి సూచనలు తీసుకోవడానికి వీలుండదు. బ్యాట్స్‌మెన్‌కు నీళ్లందించే నెపంతో అప్పడప్పుడు సందేశాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు అంపైర్లు వారిని వారిస్తుంటారు. ఇక ఫీల్డింగ్ జట్టుకు కూడా బయట నుంచి సందేశాలు పంపుతుంటారు. అయితే కెప్టెన్‌కు ఏదైనా మెసేజ్ అందించాలంటే సమయం ఓవర్ల మధ్యలో తప్ప వేరే సమయంలో కుదరదు. దీనికి కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాఫ్ ఒక ఉపాయం కనిపెట్టింది.

    కోల్‌కతా బ్యాటింగ్ చేసే సమయంలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు సందేశం పంపడానికి కోచింగ్ స్టాఫ్ డగౌట్‌లో కూర్చొని కోడ్ లాంగ్వేజీ ద్వారా సందేశాలు పంపింది. '5 4' అంటూ బోర్డును మైదానం వైపు కనపడేలా ప్రదర్శించింది. ఇప్పుడు ఈ చర్య వివాదాస్పదంగా మారింది. బ్యాటింగ్ జట్టుకు బయట నుంచి సందేశాలు అందకూడదు. కానీ సంకేత భాషతో ఇలా సూచనలు పంపడం క్రీడా స్పూర్తికి విరుద్దమని ఆరోపణలు వస్తున్నాయి. అయితే కేవలం ఒక నెంబర్ ద్వారా ఏం సందేశం పంపగలుగుతారు అని మరొ కొంత మంది వాదిస్తున్నారు. ఇన్నింగ్స్‌కు ముందే మాట్లాడుకొని అలా కాకుండా ఇలా ఆడితే బెటర్ అని చర్చించుకొని ఉంటారు. ఆ ప్లాన్ అమలు చేయమని చిన్న సంకేతం ఇచ్చి ఉంటారు. అది కూడా తప్పా అని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అలా కోడ్ లాంగ్వేజీలో మాట్లాడుకోకూడదని ఎలాంటి నిబంధనలు లేవని సెహ్వాగ్ గుర్తు చేశాడు. ఐపీఎల్‌లో స్ట్రాటజిక్ టైం పేరుతో నేరుగా కోచింగ్ సిబ్బంది వచ్చి మాట్లాడటానికి నిబంధనలు అనుమతిచ్చినప్పుడు ఈ చిన్న సంకేత భాష తొండి ఎలా అవుతుందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.





    కాగా, సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పంజాబ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లో 123/9 స్కోర్ చేసింది. టార్గెట్ ఛేదించడానికి బరిలోకి దిగిన కోల్‌కతా తడబడినప్పటికీ రాహుల్ త్రిపాఠి (41), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (47) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Cricket, IPL 2021, Kolkata Knight Riders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు