ధోనీ వెనుక ఉంటే క్రీజు దాటొద్దు... బ్యాట్స్‌మన్‌లకు ఐసీసీ సలహా

వెల్లింగ్టన్ వన్డేలో ధోనీ విషయంలో కాస్త ఏమరుపాటుగా వ్యవహరించిన కివీస్ బ్యాట్స్‌మన్ నీశమ్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 4, 2019, 11:38 AM IST
ధోనీ వెనుక ఉంటే క్రీజు దాటొద్దు... బ్యాట్స్‌మన్‌లకు ఐసీసీ సలహా
మహేంద్ర సింగ్ ధోనీ
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 4, 2019, 11:38 AM IST
మెరుపు వేగంతో స్టంపౌట్లు చేయడంలో ధోనీకి సాటి ఎవరు లేరు. పోటీ కూడా రారు. స్టంపైట్లలో ధోని స్టైలే వేరు. మెరుపు వేగంతో స్పందించి ఎలాంటి స్టార్స్ బ్యాట్స్‌మెన్ అయినా కూడా ఇంటికి సాగనంపుతాడు. తాజాగా జరిగిన కివీస్-టీమిండియా లాస్ట్ వండేలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. వెల్లింగ్టన్ వన్డేలో ధోనీ విషయంలో కాస్త ఏమరుపాటుగా వ్యవహరించిన కివీస్ బ్యాట్స్‌మన్ నీశమ్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. 36 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. నీశమ్(32 బంతుల్లో 44) వరుస బౌండరీలతో ప్రమాదకరంగా మారాడు. ఈ సమయంలో కేదార్ జాదవ్‌ను బౌలింగ్‌కు పిలిచిన ధోనీ దానికి తగిన ఫలితం రాబట్టాడు.

జాదవ్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడేందుకు నీశమ్ ప్రయత్నించగా బంతి అతని శరీరానికి తగిలి వెనక్కి వెళ్లింది. ఈ సమయంలో ధోనీ సహా అందరూ ఎల్బీకోసం అప్పీల్ చేస్తుండగా.. బంతి ధోనీకి కాస్త దూరంగా ఉండడం గమనించిన నీశమ్ పరుగుకు ప్రయత్నించాడు. అంతే వేగంగా ధోనీ బంతిని అందుకోవడం ..వికెట్లకు విసరడం జరిగిపోయింది. దీంతో నీశమ్ రనౌట్‌తో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంతగా అంటే ధోని చేసిన ఈ రన్ అవుట్‌పై ఐసీసీ సైతం స్పందిచింది.
ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ దోని వికెట్ల వెనుక ఉంటే.. ఎలాంట బ్యాట్స్‌మన్ అయినా క్రీజ్ దాటకపోవడమే మంచిదని సలహా ఇచ్చారు.
First published: February 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...