హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli Trolled: ఎల్‌పీయూ యూనివర్సిటీపై కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Virat Kohli Trolled: ఎల్‌పీయూ యూనివర్సిటీపై కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

విరాట్ కొహ్లి (ఫైల్ ఫోటో)

విరాట్ కొహ్లి (ఫైల్ ఫోటో)

విరాట్ కొహ్లీ చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. కొందరు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా విరాట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ గురించి ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది.

విరాట్ కొహ్లీ (Virat Kohli).. భారత స్టార్ బ్యాట్స్ మెన్, సూపర్ కెప్టెన్ కూడా. దేశంలో ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తన ప్రతిభతో కెప్టెన్ స్థాయికి ఎదిగి.. ఆ పొజిషన్‌లో చాలా కాలం నుంచి కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీ చక్కటి ప్రదర్శన కనబర్చినప్పుడు ఆకాశానికి ఎత్తే ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో పాటు ఆయన పొరపాటు చేస్తే అంతే స్థాయిలో ట్రోలింగ్ చేసేవారు కూడా ఉన్నారు. తాజాగా విరాట్ కొహ్లీ చేసిన ఓ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్.. కొందరు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా విరాట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) గురించి ఒక పోస్ట్ చేశాడు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లలో చాలామంది ఎల్‌పీయూ వర్సిటీ విద్యార్థులేనని పేర్కొన్నాడు. అయితే విశ్వక్రీడలను తన బ్రాండ్‌ ప్రమోషన్‌కు వాడుకోవడం కొందరికి నచ్చలేదు. అందుకే వారంతా విరాట్ కొహ్లీని ట్రోల్ చేస్తున్నారు.

* ఆ పోస్ట్‌లో ఏముంది?

టోక్సో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందం గురించి కోహ్లీ వివరిస్తూ.. "భారత ఒలింపియన్లలో పది శాతం మంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుకున్న వారే. ఎల్‌పీయూ భారత క్రికెట్ జట్టుకు కూడా కొందరు విద్యార్థులను పంపుతుందని ఆశిస్తున్నా" అంటూ ఓ ప్రమోషనల్ పోస్ట్ పెట్టాడు. అంతే కాదు.. ఆ యూనివర్సిటీలో చదువుకున్న మన్ ప్రీత్ సింగ్, నీరజ్ చోప్రా, నిషాద్ కుమార్, అమోజ్ జేకబ్, మన్ దీప్ సింగ్, బజ్ రంగ్ పూనియా, వరుణ్ కుమార్ వంటి వారిని కూడా ట్యాగ్ చేశాడు. భారత్ లో కనీసం మరో పది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలు కావాలని, ఈ యూనివర్సిటీకి చెందిన 11 మంది ఒలింపియన్లకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. "టోక్యో 2021 ఒలింపిక్స్ లో పాల్గొంటున్న 11 మంది ఎల్ పీయూ విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ ద లక్. ఇది చాలా పెద్ద విజయం" అంటూ పోస్ట్ చేశాడు విరాట్.

ఇది అభిమానులకు అంతగా నచ్చలేదని చెప్పుకోవాలి. "ఇది ఓ మీమ్ పేజ్ వాళ్లు పోస్ట్ చేశారేమో అనుకున్నా" అంటూ చాలామంది కామెంట్ చేశారు. చాలామంది పెయిడ్ పార్టనర్ షిప్ అనే ట్యాగ్ పోస్ట్ చేయనందుకు ఆయనను ట్రోల్ చేశారు. పేజ్ హ్యాక్ అయిందని కొందరు.. వాళ్లు మొదట భారత ప్లేయర్లు కాబట్టి అందరు ఒలింపియన్లకు కొహ్లీ ఆల్ ద బెస్ట్ చెప్పి ఉంటే బాగుండేదని మరికొందరు విభిన్నమైన కామెంట్లు పెడుతూ కొహ్లీని ట్రోల్ చేస్తున్నారు.

విరాట్ కొహ్లీ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్. అందుకే బ్రాండ్లు ఎప్పుడు కొహ్లీ డేట్స్ కోసం.. ఆయనతో తమ ప్రకటన షూట్ చేయడం కోసం పోటీ పడుతుంటాయి. గతంలో ప్యూమా అనే సంస్థ 110 కోట్ల రూపాయలకు కొహ్లీతో డీల్ మాట్లాడుకున్న సంగతి మనకు తెలిసిందే. అంతే కాదు.. కొహ్లీ ఒక్క ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కూడా ఎన్నో కోట్లు తెచ్చిపెడుతుంది. ప్రమోషనల్ పోస్ట్ లకు కూడా కోట్లు తీసుకునే కొహ్లీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తాజా ప్రమోషనల్ పోస్ట్ అభిమానులకు అంతగా రుచించలేదనే చెప్పుకోవాలి.

First published:

Tags: Instagram post, Team India, Virat kohli

ఉత్తమ కథలు