భారత జట్టులో (Team India) ఉన్న అతి తక్కువ మంది ఆల్ రౌండర్లలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఒకడు. కొద్దికాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న పాండ్యా భారత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. వెన్నెముక శస్త్ర చికిత్స తర్వాత పాండ్యాలో మునుపటి ఫామ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ (T-20 World Cup 2021) లో అతడు జట్టుకు తిరిగి వచ్చినా సరైన ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఫామ్ కోల్పోవడంతో.. ఇక తాను ఐపీఎల్ ఆడటం ప్రారంభించినప్పట్నుంచి అండగా ఉన్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు.. ఈసారి అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడు ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, లేటెస్ట్ గా హార్దిక్ పాండ్యా వీడియో ఒకటి వైరలవుతుంది. ఈ వీడియోలో ఓ ఫ్యాన్ పట్ల హార్దిక్ రూడ్ బిహేవియర్ పై నెటిజన్లు ఫైరవుతున్నారు.
అసలు వివరాల్లోకెళితే.. రెండు రోజుల క్రితం హార్దిక్ పాండ్యా, అతని సోదరడు కృనాల్ పాండ్యా ముంబైలోని బాంద్రాలో కాసేపు హల్చల్ చేశారు. బాంద్రాలోని ఒక క్లినిక్ బయట ఇద్దరూ కనపడ్డారు. ఖరీదైన కారులో వచ్చిన పాండ్యా సోదరులు కాసేపు క్లీనిక్‌లో గడిపి బయటకు వచ్చారు. క్లినిక్ వెలుపలకు వచ్చిన హార్దిక్ పాండ్యాను చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు.
హార్దిక్ పాండ్యా కూడా ఫ్యాన్స్ కు సెల్ఫీలు ఇచ్చాడు. అయితే, ఓ ఫ్యాన్ హార్దిక్ భుజంపై చేయి వేసి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. దీంతో హార్దిక్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. అతని చేయిని భుజం మీద నుంచి తోసేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. హార్దిక్ పాండ్యా రూడ్ బిహేవియర్ పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ఇంత పొగరు అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు. అదే ఆడపిల్ల చేయి వేసి ఉంటే ఇలా చేసివాడివి కాదుగా అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
అయితే, గాయంతో బాధపడుతుండటంతో అతను సౌతాఫ్రికా సిరీస్ కు ఎంపికవ్వడం కష్టమే అంటున్నారు. అంతే కాకుండా ఎన్ఏసీలో రిపోర్టు చేయాలని కూడా బీసీసీఐ సూచించింది.హార్దిక్ పాండ్యా కనుక పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ నిరూపించుకంటే వన్డే సిరీస్‌కు అతడిని పరిశీలించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పాండ్యా అప్పటిలోగా కోలుకుంటాడా అనేది అనుమానంగా మారింది.
ఇది కూడా చదవండి : టీమిండియా వ్యూహం అదేనా..? తుది జట్టుపై హింట్ ఇచ్చిన కేఎల్ రాహుల్..
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న పాండ్యా బ్రదర్స్ ని ఆ ఫ్రాంచైజీ ఈ సారి రిటైన్ చేసుకోలేదు. వేలంలో తిరిగి కొంటుందో లేదో కూడా అనుమానమే. కొత్తగా వచ్చిన అహ్మదాబాద్ జట్టుకు వెళతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాండ్యా బ్రదర్స్ ఇద్దరూ ఆల్‌రౌండర్లే. కృనాల్ స్నిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించగలడు. అంతే కాకుండా మంచి పేస్‌తో బౌలింగ్ చేస్తాడు. ప్రస్తుతం టీమిండియా స్థానం కోల్పోయిన వీళ్లిద్దరూ తిరిగి జట్టులో స్థానం సంపాదిస్తారా లేదా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Hardik Pandya, Team india, Viral Video