Home /News /sports /

NETIZENS QUESTIONS BCCI THAT THEY ADOPTED VIRAT KOHLI WIFE ANUSHKA SHARMA BA

న్యూజిలాండ్‌కు టీమిండియా... అనుష్క శర్మని బీసీసీఐ దత్తత తీసుకుందా?

విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ ( Anushka Sharma/ Twitter )

విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ ( Anushka Sharma/ Twitter )

ఆసీస్ మీద టెస్ట్, వన్డే సిరీస్‌లు గెలిచి జోరు మీద ఉన్న భారత జట్టు న్యూజిలాండ్‌లో దిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వెంట అనుష్క శర్మ కూడా వెళ్లడంతో నెటిజన్లు సెటైర్లు మొదలుపెట్టారు.

    ఐదు వన్డేల సీరిస్ కోసం భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ చేరుకుంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ విమానాశ్రయంలో టీమిండియాకు ఘనస్వాగతం లభించింది. ఆసీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఘన విజయం సాధించి చరిత్రను సృష్టించి విరాట్ కోహ్లీ సేనకు స్థానిక భారతీయులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. టీమిండియా ఆటగాళ్లు, జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అతని భార్య అనుష్క శర్మకు కూడా ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

    virat kohli- anushka sharma
    విరాట్ కొహ్లీ-అనుష్క శర్మ ( Anushka Sharma/ Twitter )


    ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నా, అనుష్క శర్మ అక్కడ ప్రత్యక్షం అవుతోంది. ఇటీవల ఆసీస్ పర్యటన సందర్భంగా కూడా ఆమె అక్కడ కనిపించింది. అంతకు ముందు బీసీసీఐ నిర్వహించిన ఓ కార్యక్రమానికి కూడా ఆమె హాజరై టీమిండియా మెంబర్స్‌తో కలసి ఫొటోలకు ఫోజులిచ్చింది. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేగింది. అయినా, ఆమె వెనక్కి తగ్గలేదు. ఫారెన్ టూర్లలో పతి అడుగుజాడల్లో నడుస్తోంది.

    టీమిండియా, విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ ( Virat kohli / Twitter )


    దీంతో నెటిజన్లకు చాన్స్ దొరికింది. అనుష్క శర్మను బీసీసీఐ దత్తత తీసుకుందా అని కొందరు ప్రశ్నిస్తూ ట్వీట్ చేస్తే, ఆమెను కూడా జట్టులో మెంబర్ చేసేస్తే బావుంటుందంటూ మరికొందరు జోక్ చేశారు. విరాట్ కోహ్లీ భారత జట్టు కెప్టెన్ అయితే, అనుష్క శర్మ వైస్ కెప్టెన్ అంటూ సెటైర్లు వేశారు.

    anushka_sharma- virat_kohli
    అనుష్క శర్మ, విరాట్ కొహ్లీ ( Virat Kohli / BCCI / twitter )


    మరోవైపు ఆసీస్ మీద టెస్ట్, వన్డే సిరీస్ గెలిచి టీమిండియా జోరు మీద ఉంది. అటు న్యూజిలాండ్ కూడా సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో సత్తా చాటింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది, మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఒకే ఒక్క టీ20లో కూడా విజయం సాధించింది. దీంతో రెండు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈనెల 23న కివీస్ టీమిండియా మధ్య తొలి వన్డే జరగనుంది.
    First published:

    Tags: Anushka Sharma, Cricket, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు