Home /News /sports /

Gutka Man: 'బాబూ స్టార్ స్పోర్ట్స్ కెమేరామాన్.. ఎంత పని చేశావ్ భయ్యా'.. ఒక్క రోజులో ఫేమస్ అయిన గుట్కా మ్యాన్

Gutka Man: 'బాబూ స్టార్ స్పోర్ట్స్ కెమేరామాన్.. ఎంత పని చేశావ్ భయ్యా'.. ఒక్క రోజులో ఫేమస్ అయిన గుట్కా మ్యాన్

గుట్కా మ్యాన్ ఫొటోతో పండుగ చేసుకుంటున్న మీమర్స్ (PC: Twitter Video Grab)

గుట్కా మ్యాన్ ఫొటోతో పండుగ చేసుకుంటున్న మీమర్స్ (PC: Twitter Video Grab)

Gutka Man: న్యూజీలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్ అర్దసెంచరీలు చేశారు. అయితే వీరందరి కంటే ఒక వ్యక్తి మాత్రం మ్యాన్ ఆఫ్ ది డే అయ్యాడు. అతనే గుట్కా మ్యాన్. ఆ విశేషాలేంటో చదవండి.

ఇంకా చదవండి ...
  కాన్పూర్ వేదికగా ఇండియా - న్యూజీలాండ్ (India Vs New Zealand) మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మ్యాచ్ తోలి రోజు టీమ్ ఇండియా (Team India) అరంగేట్రం బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అర్ద సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తొలి రోజు ముగిసే సమయానికి 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మీడియా మొత్తం అయ్యర్ గొప్ప ఇన్నింగ్స్ పైన.. అతడి ఘనత పైనే ఫోకస్ చేసింది. కానీ సోషల్ మీడియాకు (Social Media) మాత్రం శ్రేయస్ అయ్యర్ కంటే వేరే వ్యక్తిపై ఫోకస్ పెట్టింది. తొలి టెస్టు మొదటి రోజు మొత్తం అతడే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. అయితే అతనేమీ క్రికెటర్ కాదు. కనీసం ఇండియా, న్యూజీలాండ్ జట్లతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు. కేవలం మ్యాచ్ చూడటానికి గ్రీన్ పార్క్ స్టేడియంకు వచ్చిన ఒక ప్రేక్షకుడు మాత్రమే. కానీ అతడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా.. మీమ్స్ చేసే వాళ్లకు మంచి సరుకు అయ్యడు.

  గ్రీన్ పార్క్ స్టేడియంకు ఒక అమ్మాయి, అబ్బాయి మ్యాచ్ చూడటానికి వచ్చారు. గ్యాలరీల్లో కూర్చొని మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో స్టేడియంలోని ఫ్యాన్స్ సంబరాలు చేశారు. చప్పట్లు కొడుతూ అయ్యర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో స్టార్ స్పోర్ట్స్ కెమేరామాన్ ఆ జంటపై ఫోకస్ చేశాడు. ఆ సమయంలో సదరు వ్యక్తం నోట్లో గుట్కా నములుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు. కెమేరా తనవైపు ఫోకస్ అవుతున్న విషయాన్ని గుర్తించి చేయి కూడా ఊపాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అసలు కథ ఆ తర్వాత ప్రారంభమైంది. అతడి వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతడిని గుట్కా మ్యాన్ అని పిలుస్తూ పోస్టులు తెగ పెట్టారు. మీమర్స్ కూడా అతడి ఫొటోతో ఒక ఆట ఆడుకున్నారు. వెల్కమ్ టూ కాన్పూర్ అని ఒకరంటే.. టీవీలో వచ్చే విమల్ యాడ్‌ని సీరియస్‌గా తీసుకున్నాడని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

  Shreyas Iyer: గురుశిష్యులు ఇద్దరూ అరంగేట్రం టెస్టులోనే సెంచరీలు బాదారు.. గరువుకు అయ్యర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే..!  సదరు గుట్కా మ్యాన్‌ని మ్యాన్ ఆఫ్ ది డేగా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా, ఇలా గుట్కా నములుతూ దొరికిన వ్యక్తి పేరు షోబిత్ పాండే. వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ అతడిని వెతికి పట్టుకున్నది. అంతే కాకుండా సోషల్ మీడియాలో అతను ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పింది. దీనికి షోబిత్ కూడా స్పందించాడు. నేను గుట్కా నమలడం లేదని షోబిత్ స్పష్టం చేశాడు. 'ముందుగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే.. నేను గుట్కా కానీ పొగాకు కానీ నమలడం లేదు. నేను నోట్లో వక్కపొడి వేసుకొని ఉన్నాను. అదే సమయంలో నా ఫ్రెండ్‌తో కాల్ మాట్లాడుతున్నా. అతను కూడా మ్యాచ్ చూడటానికి వచ్చాడు. కానీ స్టేడియంలో వేరే చోట కూర్చున్నాడు. అందుకే కాల్ చేసి ఎక్కడున్నావని అడిగాను. ఆ కాల్ కూడా 10 సెకెన్లకంటే ఎక్కువ సేపు మాట్లాడలేదు. ఆ తర్వాత అదే ఫ్రెండ్ నా వీడియో, ఫొటో వైరల్ అయ్యిందని చెప్పాడు. వైరల్ అయినందుకు పెద్దగా బాధలేదు. కానీ నా పక్కన కూర్చున్న నా చెల్లిని పట్టుకొని నా గర్ల్ ఫ్రెండ్ అంటూ టీజ్ చేయడమే తనను మరింత బాధ పెట్టింది అని' అని షోబిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:John Kora
  First published:

  Tags: India vs newzealand, Team india, Test Cricket, Viral Videos

  తదుపరి వార్తలు