'రెండు దోశలు.. కొబ్బరి చట్నీ మర్చిపోవద్దు'.. అంటూ విహారిపై ట్రోలింగ్.. ఘాటు రిప్లై ఇచ్చిన క్రికెటర్

ట్రోలర్‌కు విహారి ఘాటైన రిప్లై

సోషల్ మీడియా పరిధి పెరిగిన తర్వాత చిన్నా పెద్దా తేడా లేకుండా పోతున్నది. ఏ విషయం పైన అయినా ట్రోలింగ్స్ పెరిగిపోతున్నాయి. అలాంటి ఒక ట్రోలర్‌కు హనుమ విహారి ఎలా రిప్లై ఇచ్చాడంటే..

 • Share this:
  టీమ్ ఇండియా (Team India) టెస్టు క్రికెటర్ హనుమ విహారిని (Hanuma Vihari) టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తి ట్రోల్ (Trolling) చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉంటూ కౌంటీ క్రికెట్ ఆడుతున్న విహారి.. ఇండియాలోని కోవిడ్ పేషెంట్లకు తనవంతు సాయం అందిస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా రోగులకు అవసరమైన ఆక్సిజన్, వైద్యం, ఇంజెక్షన్లు అందేలా కృషి చేస్తున్నాడు. దీనికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. మంచి, చెడు అనే విచక్షణ లేకండా.. ఎదుటి వారు చేసే ప్రతీ పనిని ట్రోల్ చేస్తున్నారు. సామాన్యుడి నుంచి సెలెబ్రిటీల వరకు ఎవరినీ వదల కుండా ట్రోల్ చేయడమే లక్ష్యంగా కొందరు సామాజిక మాధ్యమాల్లో ఉంటున్నారు. సాధారణంగా హనుమ విహారి సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌కు జవాబు ఇవ్వడు. తన పని తాను చేసుకుంటూ అందరికీ దూరంగా ఉంటాడు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి చేసిన విమర్శను మాత్రం విహారి తట్టుకోలేక పోయాడు. వెంటనే అతడికి ఘాటైన రిప్లై ఇచ్చాడు.

  విహారి కరోనా బాధితులను ఆదుకోవడానికి విరాళాల సేకరణ చేపట్టాడు. కెట్టో అనే స్వచ్చంద సంస్థ తరపున విరాళాలు అందించాలని కోరాడు. కాగా విహారి చేస్తున్న ఈ పనులను ఎంతో మంది అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం వెటకారంగా కామెంట్ చేశాడు. 'సరే భాయ్.. రెండు మసాలా దోశలు తీసుకొని రండి. కొబ్బరి చట్నీ మాత్రం మరిరిపోవద్దు' అని కామెంట్ చేశాడు. గతంలో చాలా మంది ఇలాగే అసంబద్దమైన కామెంట్లు చేసినా విహారి వాటికి దూరంగానే ఉన్నాడు. కానీ కరోనా కష్టకాలంలో చేస్తున్న పనులను కూడా వెటకారం చేస్తూ కామెంట్ చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. వెంటనే అతడికి తగ్గట్లుగా గట్టి జావాబు ఇచ్చాడు. 'ఇండియాలో ప్రస్తుతం చాలా మంది కరోనాతో బాధపడుతున్నారు. నువ్వు కూడా వారిలాగే బాధపడుతుంటే కచ్చితంగా తెచ్చి ఇచ్చేవాడిని. ఒక్క నిమిషం.. కానీ నువ్వు మరో రోగంతో బాధపడుతున్నావు. ఐయామ్ సారీ' అని బదులు ఇచ్చాడు. విహారి ఇచ్చిన ఘాటైన సమాధానానికి సదరు ట్రోలర్ కూడా సైలెంట్ అయిపోయాడు. అభిమానులు విహారి ఇచ్చిన సమాధానాన్ని ప్రశంసిస్తున్నారు.

  కాగా, హనుమ విహారి టీమ్ ఇండియా ఆడబోయే డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ పర్యటనలకు ఎంపికయ్యాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ లోనే కౌంటీ క్రికెట్ ఆడుతున్న విహారి.. భారత జట్టుతో జూన్ లో కలుస్తాడు. టీమ్ ఇండియా ఇక్కడి నుంచి బయలుదేరి జూన్ 2న ఇంగ్లాండ్ చేసుకుంటుంది. అక్కడ 10 రోజుల క్వారంటైన్ అనంతరం బయోబబుల్‌లోకి ప్రకవేశిస్తుంది. అదే సమయంలో విహారి జట్టుతో జాయిన్ అవుతాడు.
  Published by:John Naveen Kora
  First published: