హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : ఒకే ఒక్క బంతి.. అతన్ని జాతీయ జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది..

Viral Video : ఒకే ఒక్క బంతి.. అతన్ని జాతీయ జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది..

Viral Video : ఏదైనా ప్లేయర్ అద్భుతంగా రాణిస్తే.. అతన్ని జాతీయ జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం ఓ బౌలర్ వేసిన ఒకే ఒక్క బంతి అతని జీవితాన్నే మార్చేసింది. ఆ ఒక్క బంతి ప్రదర్శనతోనే అతను జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. అవును మీరు విన్నది నిజమే.

ఇంకా చదవండి ...

  క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. క్రికెట్ లో ఎవరైనా తమ ప్రదర్శనతో హీరో అవ్వొచ్చు.. అలాగే, విలన్ కూడా అవ్వొచ్చు. ఆ మ్యాచ్ లో జరిగిన ప్రదర్శనతో భవిష్యత్తుపై ఓ క్లారీటీ వస్తోంది. ఏదైనా ప్లేయర్ అద్భుతంగా రాణిస్తే.. అతన్ని జాతీయ జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం ఓ బౌలర్ వేసిన ఒకే ఒక్క బంతి అతని జీవితాన్నే మార్చేసింది. ఆ ఒక్క బంతి ప్రదర్శనతోనే అతను జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. అవును మీరు విన్నది నిజమే. ఈ ఘటన నేపాలీ క్రికెట్ లో జరిగింది. అసలు వివరాల్లోకెళితే.. నేపాలీ క్రికెటర్ గుల్షన్‌ ఝా ఇప్పుడు ఓ పెద్ద హాట్ టాపిక్ గా మారాడు. అతను వేసిన ఒక్క బంతి సెలక్టర్లను ఇంప్రెస్‌ చేసింది. ఎంతలా అంటే ఏకంగా ఒక ట్రై సిరీస్‌కు జాతీయ జట్టులోకి ఎంపిక చేశారు. విషయంలోకి వెళితే.. గుల్షన్‌ ఝా నేపాల్‌ పోలీస్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుల్షన్‌ ఝా ఒక అద్బుత బంతితో మెరిశాడు.

  ఇది కూడా చదవండి : ఈ పాకిస్తాన్ యాంకర్ మహ్మద్ సిరాజ్ కు పెద్ద ఫ్యాన్.. ఆమె గురించి విషయాలు తెలుసా..?

  స్వతహాగా ఫాస్ట్‌ బౌలర్‌ అయిన గుల్షన్‌ వేసిన బంతి బులెట్‌ వేగంతో బ్యాట్స్‌మన్‌ పక్కనుంచి దూసుకెళ్లింది. హెల్మెట్‌ లేకపోయుంటే మాత్రం బ్యాట్స్‌మన్‌ ముఖం పచ్చలయ్యేది. హెల్మెట్‌ ఎడ్జ్‌ తీసుకుంటూ వెళ్లిన ఆ బంతి 98 కీమీ స్పీడుగా నమోదైంది. అతని వేసిన బౌన్సర్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఓవరాల్‌గా గుల్షన్‌ ఝా ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు.

  ఒక ఆటగాడిని అతను వేసే ఒక బంతి.. ఒక ఇన్నింగ్స్‌.. వెలుగులోకి తీసుకొస్తాయని అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇప్పుడు గుల్షన్‌ ఝా విషయంలో అదే నిజమైంది. ఒమన్‌, అమెరికా జట్లతో సెప్టెంబర్‌ 14 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు జరగునున్న ట్రై సిరీస్‌కు నేపాల్‌ జట్టులోకి గుల్షన్‌ ఎంపికయ్యాడు. తాజాగా గుల్షన్‌ వేసిన బంతికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నేపాల్ భవిష్యత్తు సూపర్ స్టార్ గా గుల్షన్ ఎదిగే అవకాశముందంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

  First published:

  Tags: Cricket, Nepal, Sports, Viral Video

  ఉత్తమ కథలు