విరాట్ కొహ్లీ స్ట్రాంగ్ కామెంట్స్‌పై సెటైర్లు

భారత జాతీయ జట్టుకు ఆడటాన్ని అరుదైన గౌరవంగా భావించే విరాట్ కొహ్లీపై ఇలా దేశభక్తి ముసుగులో కౌంటర్ ఎటాక్ కావాలనే చేస్తున్నారని కొంతమంది అభిమానులు మండిపడుతున్నారు.

Prasanth P | news18-telugu
Updated: November 8, 2018, 2:56 PM IST
విరాట్ కొహ్లీ స్ట్రాంగ్ కామెంట్స్‌పై సెటైర్లు
విరాట్ కొహ్లీ ( BCCI / Twitter )
  • Share this:
ఓ వైపు క్రికెట్ ప్రపంచమంతా విరాట్ కొహ్లీనీ ఆకాశానికెత్తేస్తుంటే...మరోవైపు కొంతమంది ఫ్యాన్స్ దేశభక్తి ముసుగులో టీమిండియా కెప్టెన్‌ను కించపరుస్తున్నారు. ప్రస్తుతం ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రికార్డ్‌ల మోత మోగిస్తోన్న విరాట్...ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా వెలుగొందుతున్నాడు. పాత రికార్డ్‌లు చెరిపేస్తూ..సరికొత్త వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రత్యర్ధి ఆటగాళ్లు కవ్విస్తే క్రికెట్ ఫీల్డ్‌లోనే ధీటుగా బదులిచ్చే విరాట్...సోషల్ మీడియాలో ఓ అభిమాని ట్వీట్‌కు తనదైన స్టైల్‌లోనే స్పందించాడు.

నవంబర్ 5న 30వ పుట్టినరోజు జరుపుకున్న కోహ్లీ... ఫ్యాన్స్ పంపిన శుభాకాంక్షల ట్వీట్స్‌ను చదువుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఓ పాకిస్థాన్ వెబ్‌సైట్‌ కోసం పనిచేస్తున్న సజ్ సాదిక్ అనే క్రికెట్ జర్నలిస్ట్ చేసిన ట్వీట్‌ వివాదస్పదంగా మారింది. ‘విరాట్ ఓవర్ రేటెడ్ బ్యాట్స్‌మెన్. నాకు అతని బ్యాటింగ్‌లో పెద్దగా ప్రత్యేకత ఏమీ కనిపించదని...కొహ్లీ లాంటి భారత క్రికెటర్ల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ నాకు బాగా నచ్చుతుంది...’ అని ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌కు కౌంటర్ ఇస్తూ విరాట్ ఓ వీడియో ట్వీట్ చేశాడు.‘నా ఆటతీరు నచ్చకపోతే అది నీ పర్సనల్ విషయం. దాని గురించి నేనేమీ మాట్లాడను. కానీ భారత దేశంలో ఉంటూ వేరే దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావ్. నా దేశాన్ని ఇష్టపడని నీకు ఇక్కడుంటే అర్హత లేదు. దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లిపోతే బాగుంటుంది... ’ అంటూ గట్టిగా సమాధానం చెబుతూ వీడియో పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ.

అయితే విరాట్ రియాక్షన్‌పై కామెంట్లు వినిపిస్తున్నాయి. భారత క్రికెటర్లను ఇష్టపడనంత మాత్రాన దేశం వదిలేయాలా? అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. విరాట్ కోహ్లీకి కూడా టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ అంటే ఇష్టం కదా... మరి ఆయనెందుకు ఇక్కడున్నారంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. దీంతో విరాట్ కోహ్లీకి మరోసారి విమర్శల వర్షం మొదలైంది. కోహ్లీని ఉద్దేశించి ట్వీట్లు చేస్తున్నారు. ‘టీమిండియాకు సారథి అయినంత మాత్రాన సాటి భారతీయుడిని వెళ్లిపొమ్మనే అధికారం కొహ్లీకి లేదు. కోహ్లీ దూకుడు తగ్గించుకో’...అని ఒకరు, ‘కోహ్లీ.. నీ నుంచి ఇలాంటి సమాధానం ఊహించలేదు. అభిమానులను అభిమానించాల్సిన బాధ్యత నీ మీద ఉందని మర్చిపోకు.’అని మరొకరు కామెంట్స్ చేశారు. ‘భారతీయులకు భావప్రకటనా స్వేచ్ఛ హక్కు కూడా ఉందని నీకు తెలియదా కోహ్లీ? దేశం వదిలి పొమ్మనడానికి నువ్వెవరు?.మనం ఇండియాలో ఉన్నంత మాత్రాన ఇతర దేశాల ప్రజలను ద్వేషించాలని ఎవరూ చెప్పలేదు’. అని కొహ్లీకే హితభోద చేశాడు.

భారత జాతీయ జట్టుకు ఆడటాన్ని అరుదైన గౌరవంగా భావించే విరాట్ కొహ్లీపై ఇలా దేశభక్తి ముసుగులో కౌంటర్ ఎటాక్ కావాలనే చేస్తున్నారని కొంతమంది అభిమానులు మండిపడుతున్నారు. ఎవరో అభిమాని చేసిన నెగిటివ్ కామెంట్స్‌కు ఇంత రాద్దాంతం అవసర్లేదని అంటున్నారు.
Published by: Prasanth P
First published: November 8, 2018, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading