ఇప్పుడు దేశమంతా నీరజ్ చోప్రా (Neeraj Chopra) పేరు మార్మోగిపోతున్నది. టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) 2020లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని (Gold Medal) అందించిన జావెలిన్ త్రో వీరుడు రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. టోక్యో నుంచి సోమవారం ఢిల్లీకి చేరుకున్న భారత అథ్లెట్ల బృందంలో నీరజ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఢిల్లీలోని అశోక ప్యాలెస్ హోటల్‌లో అథ్లెట్లు అందరికీ ఘన సన్మానం చేశారు. నీరజ్ చోప్రాకు ఒకవైపు భారీ నజరానాలు, ప్రమోషన్లు, ఇళ్ల స్థలాలు అందుతుంటే.. మరోవైపు ఫ్యాన్స్ అతడి బయోపిక్ (Biopic) తీయాలంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. కొంత మంది సెటైరికల్‌గా నీరజ్ చోప్రా సినిమాను బాలీవుడ్‌లో తీస్తే కనుక స్టోరీ ఇలా ఉంటుందంటూ షేర్ చేస్తున్నారు. హర్యాణా కుర్రోడి స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆ ఆలోచన కూడా బాలీవుడ్ నిర్మాతల మదిలో ఉండే ఉంటుంది. స్వర్ణానికి ముందు నీరజ్ చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌కు 1 లక్ష మంది ఫాలోవర్లు మాత్రమే ఉండే వాళ్లు. కానీ ఇప్పుడది ఒక్కసారిగా 30 లక్షలు దాటిపోయిందంటే.. ఏ రేంజ్‌లో నీరజ్ క్రేజ్ ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈ క్రమంలో నీరజ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.
నీరజ్ చోప్రా 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచాడు. అప్పుడే అతడి పేరు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. భారత్‌లో జావెలిన్ త్రోలో రాణించే అథ్లెట్ ఒకరు ఉన్నారనే విషయం తెలిసింది. అప్పుడే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా బయోపిక్ గురించిన ప్రస్తావన వచ్చింది. ఒక వేళ మీ బయోపిక్ తీస్తే ఎవరు హీరోగా ఉండాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు నీరజ్ ఆనాడే సమాధానం ఇచ్చాడు. తన బయోపిక్ తీస్తే చాలా సంతోషపడతానని.. అయితే ఇద్దరు నటులంటే తనకు ఇష్టం కాబట్టి వారిద్దరిలో ఎవరైనా తనకు ఓకే అని నీరజ్ అన్నాడు. తన సొంత రాష్ట్రం హర్యాణాకు చెందిన రణ్‌దీప్ హుడా లేదా అక్షయ్ కుమార్‌లలో ఎవరు నటించినా తనకు ఓకే అని చెప్పుకొచ్చాడు. కాగా, నీరజ్ బయోపిక్‌లో అసలు వేరే హీరో అవసరమా? అతడే బాలీవుడ్ మెటీరియల్ లాగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నీరజ్ స్వర్ణం గెలిచిన తర్వాత అక్షయ్ కుమార్, రణ్‌దీప్ హుడా.. ఇద్దరూ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పడం విశేషం.
It’s a GOLD ?Heartiest Congratulations @Neeraj_chopra1 on creating history. You’re responsible for a billion tears of joy! Well done #NeerajChopra! #Tokyo2020 pic.twitter.com/EQToUJ6j6C
— Akshay Kumar (@akshaykumar) August 7, 2021
That’s it !! ??
#NeerajChopra pic.twitter.com/TkmDxiwuj5
— Randeep Hooda (@RandeepHooda) August 9, 2021
ఇక నీరజ్ చోప్రా బయోపిక్ పేరుతో అక్షయ్ కుమార్‌కు కొత్త సినిమా దొరికిందని ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. అంతే కాకుండా గతంలో అక్షయ్ కుమార్ జావెలెన్ స్టిక్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ఫస్ట్ లుక్ విడుదలైందని కూడా మీమ్స్ చేసి సోషల్ మీడియాలోపోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి నీరజ్ చోప్రా బయోపిక్ తీస్తే ఎవరు హీరోగా నటిస్తారో అనే దానికి గతంలోనే క్లారిటీ దొరకడంతో ఇక ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Bollywood, Olympics, Tokyo Olympics