భారత అత్యున్నత క్రీడా అవార్డ్ .. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు (Major Dhyan Chand Khel Ratna Award)కు 11 మంది అథ్లెట్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ సిఫార్సు చేసింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రోలో చారిత్రాత్మక గోల్డ్ మెడల్ సాధించిన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) తో పాటు ఇతర ఒలింపిక్ పతక విజేతలు రవి దహియా, పీఆర్ శ్రీజేష్, లోవ్లినా బోర్గోహైల ఈ లిస్టులో ఉన్నారు. సునీల్ ఛెత్రీతో పాటు ప్రముఖ భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ (Mithali Raj) కూడా అత్యున్నత గౌరవానికి నామినేట్ అయ్యారు.
టోక్యో ఒలింపిక్స్ 2020తో పాటు టోక్యో పారాలింపిక్స్ 2020లో పలువురు అథ్లెట్లు దేశం గర్వపడేలా చేసిన సంగతి తెలిసిందే. దీంతో 2021ని భారతదేశానికి ఒక ప్రత్యేక ఏజాగి మలిచారు. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా అవతరించిన భారత పారాలింపియన్ అవనీ లేఖరా కూడా ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ అయింది. పారాలింపిక్స్ 2020లో ఎఫ్64 పారా జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని గెలుచుకున్న సుమిత్ యాంటిల్ కూడా ఖేల్ రత్నకు సిఫార్సు అయ్యారు. వీరితోపాటు 35 మంది భారత అథ్లెట్లు అర్జున అవార్డుకు సిఫార్సు చేశారు.
ఖేల్ రత్న అవార్డుకు సిఫార్సు చేయబడిన 11 మంది భారతీయ అథ్లెట్లు:
నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్ - జావెలిన్ త్రో)
రవి దహియా (రెజ్లింగ్)
పీఆర్ శ్రీజేష్ (హాకీ)
లోవ్లినా బోర్గోహై (బాక్సింగ్)
సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్)
మిథాలీ రాజ్ (క్రికెట్)
ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్)
సుమిత్ ఆంటిల్ (జావెలిన్)
అవని లేఖ (షూటింగ్)
కృష్ణా నగర్ (బ్యాడ్మింటన్)
ఎం. నర్వాల్ (షూటింగ్)
అర్జున అవార్డుకు ఎంపికైన లిస్ట్ లో కొందరు :
యోగేష్ కథునియా (డిస్కస్ త్రో)
నిషద్ కూమార్ ( హై జంప్)
ప్రవీణ్ కుమార్ ( హై జంప్)
శరద్ కుమార్ (హై జంప్)
సుహాస్ LY (బ్యాడ్మింటన్)
సింగ్ రాజ్ అధానా (షూటింగ్)
శిఖర్ ధావన్ (క్రికెట్)
భవీనా పటేల్ ( టేబుల్ టెన్నిస్)
గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా పిలవగా, ప్రస్తుతం ఈ అవార్డును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లెజెండరీ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో మార్చారు. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ 2020లో హాకీలో టీమిండియా ప్రదర్శన ఆధారంగా భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారంగా మార్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boxing, Hockey, Mithali Raj, Shikhar Dhawan, Sports, Tokyo Olympics, Wrestling