టోక్యో ఒలింపిక్స్ 2020 (Tokyo Olympics 2020) అథ్లెటిక్స్‌లో (Athletics) స్వర్ణ పతకం (Gold Medal) సాధించి ఇండియాకు తొలి గోల్డ్ అందించిన నీరజ్ చోప్రా (Neeraj chopra) రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. నీరజ్ జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించడంతో ఇప్పుడు చాలా మంది ఆ ఆటలో తర్ఫీదు కోసం స్పోర్ట్స్ స్కూల్స్, అకాడమీల ముందు క్యూలు కడుతున్నాడు. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్స్‌ను పెంచుకున్న నీరజ్.. అడ్వర్టైజ్‌మెంట్ రంగంలో కూడా చెలరేగిపోతున్నాడు. గతంలో రూ. 10 లక్షల తీసుకున్న నీరజ్.. ఇప్పుడు ఆ ధరను అమాంతం పెంచేశాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఫుల్ బిజీగా మారిపోయిన నీరజ్ చోప్రా.. ఎక్కడికి వెళ్లిన అభిమానులు ఆయన వెంట తరలివస్తున్నారు. గత రెండు నెలలుగా పలు ప్రదేశాలు, పాఠశాలలు, కళాశాలలు తిరిగిన నీరజ్ ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం మాల్దీవులకు వెళ్లిన నీరజ్ అక్కడ కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడు.
కాగా మాల్దీవులకు వెళ్లిన నీరజ్ చోప్రా.. అక్కడ అండర్ వాటర్‌లో చేసిన విన్యాసం అందరినీ ఆకట్టుకుంటున్నది. అండర్ వాటర్‌లో జావెలిన్ విసిరనట్లుగా చేసిన యాక్షన్ అద్భుతంగా రికార్డు చేశారు. నీరజ్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. అంతే కాకుండా.. ''ఆకాశంలో.. భూమిపై.. నీటిలో.. ఎక్కడైనా తాను జావెలిన్ గురించే ఆలోచిస్తుంటాను'' అనే క్యాప్షన్ కూడా జత చేశాడు. ఈ వీడియోకు ఫ్యాన్స్ లైక్స్, షేర్లు చేస్తున్నారు. ఇదే కాకుండా మాల్దీవులకు చెందిన అనేక వీడియోలు ఫొటోలు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.
Venkatesh Iyer: వచ్చే మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌కు భారీ రేటు? అతడిపై కన్నేసిన జట్లేమిటో తెలుసా?
Aasman par, zameen pe, ya underwater, I'm always thinking of the javelin!
PS: Training shuru ho gayi hai 💪🏽 pic.twitter.com/q9aollKaJx
— Neeraj Chopra (@Neeraj_chopra1) October 1, 2021
Alarms off, vacation mode on. 😉 #Maldives pic.twitter.com/1coTi50GyK
— Neeraj Chopra (@Neeraj_chopra1) September 29, 2021
ఒలింపిక్స్‌లో మిల్కాసింగ్, పీటీ ఉష తమ పతకాలు తృటిలో చేజార్చుకున్న 37 ఏళ్ల తర్వాత నీరజ్ చోప్రా అథ్లెటిక్స్‌లో గోల్డ్ తేవడం యావత్ భారత దేశాన్ని ఆనందంలో ముంచెత్తింది. టోక్యోలో గోల్డ్ గెలవడమే కాకుండా అత్యధిక దూరం విసిరి చరిత్ర సృష్టించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఇండియాకు ఇదే తొలి పతకం కావడం విశేషం. 2008లో అభినవ్ బింద్రా గోల్డ్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కానీ ఆ పతకం కంటే నీరజ్ గెలిచిన పతకానికే ఎక్కువ ఆదరణ లభించడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tokyo Olympics