Home /News /sports /

Neeraj Chopra: నీరజ్ 'నా ఐడల్' అంటూ పాక్ అథ్లెట్ ట్వీట్.. సిగ్గులేదా అంటూ పాకిస్తాన్‌లో రచ్చ రచ్చ

Neeraj Chopra: నీరజ్ 'నా ఐడల్' అంటూ పాక్ అథ్లెట్ ట్వీట్.. సిగ్గులేదా అంటూ పాకిస్తాన్‌లో రచ్చ రచ్చ

నీరజ్‌ను ఐడల్ అంటూ ట్వీట్.. పాక్‌లో రచ్చ రచ్చ (Twitter)

నీరజ్‌ను ఐడల్ అంటూ ట్వీట్.. పాక్‌లో రచ్చ రచ్చ (Twitter)

ఇండియా-పాకిస్తాన్ మధ్య ఏ విషయంలో అయినా విభేదాలు వస్తుంటాయి. తాజాగా స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపాడని పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్‌కు అక్కడి ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు.

    టోక్యో ఒలింపిక్స్‌ 2020లో (Tokyo Olympics) భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్వర్ణ పతకం (Gold Medal) సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ పోటీలో నీరజ్ 87.58 మీటర్లు విసరగా.. ఆ తర్వాత వరుసగా వడ్లెచ్ 86.67 మీటర్లు, వాస్లీ 85.44 మీట్లు విసిరి వరుసగా స్వర్ణం, రజతం, కాంస్య గెలుచుకున్నారు. అయితే ఫైనల్ రౌండ్‌లో జర్మన్‌కు చెందిన వెబర్ నాలుగో స్థానంలో నిలవగా.. పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ (Arshad Nadeem) 84.62 మీటర్లు విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన తర్వాత అనేక మంది సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులతో పాటు ఎంతో మంది అభినందనలు తెలియజేవారు. 5వ స్థానంలో నిలిచిన అర్షద్ నదీమ్ కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. అందులో 'స్వర్ణ పతకం గెలిచిన నా ఐడల్ నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు'.. 'సారీ పాకిస్తాన్ నేను మీ కొరకు పతకం గెలవలేక పోయాను' అని నదీమ్ పేర్కొన్నాడు. జావెలిన్ త్రో ఫైనల్ ముగిసిన కాసేపటికే చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రాను పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 'ఐడల్' గా పేర్కొనడంపై పాక్ ఫ్యాన్స్ మండి పడ్డారు. తన కంటే ఒక ఏడాది చిన్నవాడైన నీరజ్‌ను ఐడల్‌గా పేర్కొనడం ఏంటనీ.. అందులో దాయాది దేశానికి చెందిన అథ్లెట్‌ను ఐడల్‌గా పేర్కొంటావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మెడల్ గెలవక పోవడమే కాకుండా ఇండియన్ అథ్లెన్‌ను పొగడటానికి సిగ్గులేదా అని కూడా తిట్టారు. మరోవైపు నదీమ్ మంచి మనసుకు పలువురు అభినందించారు. ఇది నిజమైన స్పోర్ట్స్‌మాన్‌షిప్ అంటూ పొగిడారు. కాగా, నదీమ్ ట్వీట్ ఇండియాలో కూడా వైరల్‌గా మారింది.

    ఇరు దేశాల్లో ఈ ట్వీట్ వైరల్‌గా మారిన కొద్ది సేపటికే అర్షద్ నదీమ్ ఖాతా నుంచి ట్వీట్ మాయమైంది. ఆ వెంటనే మరో ట్వీట్ ఆ ఖాతాలో కనిపించింది. 'టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో పోటీలో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు. అర్షద్‌తో కావాలనే ఆ ట్వీట్ బలవంతంగా తీసేయించి.. మరో ట్వీట్ పెట్టించారనే వార్తలు వచ్చాయి. మరోవైపు పాక్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తట్టుకోలేకే అర్షద్ నదీమ్ ఆ ట్వీట్ డిలీట్ చేసినట్లు కొంత మంది వ్యాఖ్యానించారు. గతంలో కూడా వీరిద్దరి షేక్ హ్యాండ్ వైరల్‌గా మారింది. 2018 ఏసియన్ గేమ్స్‌లో కూడా వీరిద్దరూ పోటీ పడ్డారు. అప్పుడు నీరజ్ స్వర్ణ పతకం గెలవగా.. అర్షద్ నదీమ్ కాంస్య పతకం నెగ్గాడు. కాగా, పతకాలు బహుకరించిన తర్వాత నదీమ్, నీరజ్ తమ దేశ జెండాలను భుజపై వేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చు కోవడం అప్పట్లో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు జావెలిన్ త్రోలో 8 సార్లు ఫైనల్‌లో తలపడగా.. ప్రతీ సారి నీరజ్‌దే పై చేయి అయ్యింది. చాలా కాలంగా వీరిద్దరి మధ్య స్నేహం ఉండటంతోనే నదీమ్ ఆ ట్వీట్ చేశాడని పలువురు భావించారు. కానీ చివరకు ఆ ట్వీట్ డిలీట్ అయిపోయింది.

    arshad nadeem, neeraj chopra
    నదీమ్ మొదటిగా చేసిన ట్వీట్ ఇదే (Twitter/Screen Shot)






    మరోవైపు ఆ ట్విట్టర్ అసలు అర్షద్ నదీమ్‌దే కాదనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా సెలెబ్రిటీలకు ఉండే బ్లూ టిక్ ఆ ఖాతాకు లేదు. అది ఎవరో అర్షత్ పేరుతో మెయింటైన్ చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఏదేమైనా ఫేక్ అకౌంట్ అయినా పాత ట్వీట్ పై మాత్రం రచ్చ ఆగడం లేదు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Olympics, Tokyo Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు