టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకొని భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్‌లో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్ల్గా రికార్డు సృష్టించాడు. దీంతో అతడి పేరు దేశమంతా ఒక్కసారిగా మార్మోగుతోంది. హర్యానాలోని పంచకుల స్టేడియం స్పోర్ట్స్ స్కూల్లో నీరజ్ శిక్షణ తీసుకున్నాడు. ఇక అతడు స్వర్ణం సాధించడంతో ఆ స్కూల్‌కు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఆ స్పోర్ట్స్ అడ్మిషన్ల కోసం అథ్లెటిక్స్ కోచ్ నసీమ్ అహ్మద్‌కు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ట్రైనింగ్ సెంటర్‌తో తమ పిల్లలను చేర్చుకోవాలంటూ చాలా మంది తల్లిదండ్రులు తనకు కాల్ చేస్తున్నారని అహ్మద్ చెప్పారు.
“ఒలింపిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా అర్హత సాధించాక దాదాపు 100 మంది కోచింగ్ ఇవ్వమని అడిగారు. ఇక అతడు స్వర్ణం గెలిచాక కాల్స్ అమాంతం పెరిగిపోయాయి. ఎక్కువగా జావెలిన్ త్రో కోసమే అడుగుతున్నారు. కొందరు ఏదైనా ఓ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో తమ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. ఒక్కసారిగా అథ్లెటిక్స్‌పై చాలా మందికి ఆసక్తి పెరిగింది” అని అహ్మద్ చెప్పారు.
మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుషుల జట్టు కాంస్య పతకం సాధించడం సహా.. మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేయడంతో.. హాకీ కోచింగ్ సెంటర్లకు కూడా డిమాండ్ పెరిగిపోయింది. లక్నోలోని కేడీ సింగ్ బాబు స్టేడియం, జలంధర్‌లోని సుర్జీత్ హాకీ అకాడమీ, గ్వాలియర్‌లోని ఎంపీ మహిళల హాకీ అకాడమీ, అజ్మీర్, జార్ఖండ్‌లోని హాకీ అకాడమీలకు అడ్మిషన్లు పెరిగాయి. మరోవైపు రెజ్లింగ్, ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్లపై కూడా ఆసక్తి పెరిగింది.
ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టులో ఆడిన సుశీల చాను, మొనిక, రీనా కోల్కర్ శిక్షణ పొందిన గ్వాలియర్ ఎంపీ మహిళల అకాడమీకి రద్దీ పెరిగిందని కోచ్ పరమ్‌జీత్ సింగ్ చెప్పారు. “ఇప్పటి వరకు క్రీడాకారుల కుటుంబాలకు చెందిన వారు తమ పిల్లలకు కోచింగ్ కోసం మా దగ్గరికి వచ్చే వారు. అయితే కొన్ని రోజులుగా క్రీడలతో సంబంధం లేని వారు కూడా తమ పిల్లలకు హాకీ నేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మమ్మల్ని సంప్రదిస్తున్నారు. టీచర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు కూడా తమ పిల్లలకు హాకీ నేర్పించేందుకు ముందుకు వస్తున్నారు” అని పరమ్‌జీత్ చెప్పారు. ఇంత కాలం క్రికెట్‌కు మాత్రమే విపరీతమైన క్రేజ్ ఉండగా.. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల అత్యుత్తమ ప్రదర్శనతో మిగిలిన క్రీడల పట్ల కూడా ఆసక్తి పెరుగుతోందని కోచ్‌లు అభిప్రాయపడుతున్నారు.
Keywords
Neeraj Chopra, Javelin Throw, Tokyo Olympics, Panchkula Sports Stadium, Sports School, Admissions, Olympics Gold Medal, Hockey, నీరజ్ చోప్రా, జావెలిన్ త్రో, టోక్యో ఒలింపిక్స్, పంచకుల స్పోర్ట్ స్టేడియం, క్రీడా పాఠశాల, అడ్మిషన్లు, ఒలింపిక్స్ స్వర్ణ పతకం, హాకీ
https://www.newindianexpress.com/nation/2021/aug/10/neeraj-chopra-impact-tokyo-gold-sparksadmission-rush-at-sport-schools-2342644.html
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: School admissions, Sports