Home /News /sports /

NEAT HAT TRICK VIDEO OF UMPIRE ALEEM DAR CATCHING FLYING HAT FROM SMITHS THROW GOES VIRAL NK

"హ్యాట్"ట్రిక్ అదిరిందిగా... ట్విట్టర్‌లో వైరలే వైరల్...

"హ్యాట్"ట్రిక్ అదిరిందిగా... ట్విట్టర్‌లో వైరలే వైరల్... (credit - twitter - SPN- Sports)

"హ్యాట్"ట్రిక్ అదిరిందిగా... ట్విట్టర్‌లో వైరలే వైరల్... (credit - twitter - SPN- Sports)

Wow Hat Trick : క్రికెట్‌లో ఉన్న మజా అదే. కొన్ని కొన్ని సీన్లను స్లో మోషన్‌లో చూస్తే... వావ్ అనిపిస్తుంది. ఇది అలాంటిదే. ఏం జరిగిందో తెలుసుకుందాం.

    Wow Hat Trick : అది పెర్త్ స్టేడియం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 166 పరుగులకే కివీస్ టీమ్‌ని ఆలౌట్ చేసింది. ఆ సమయంలో... ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ మధ్య జరిగిన ఘటన అందర్నీ ఆకట్టుకుంది. స్టీవ్ స్మిత్... ఓ ఫ్లాపీ హ్యాట్‌ను ఫీల్డ్ నుంచీ పాస్ చేశాడు. అది ఫ్లైయింగ్ సాసర్‌లా గాల్లో ఎగురుతూ వెళ్లింది. దాన్ని ఒకే చేతితో.... అంపైర్ అలీమ్ దార్ క్యాచ్ చేసిన విధానం అద్భుతంగా సాగింది. ఈ వీడియో క్లిప్‌ని ట్విట్టర్‌లో షేర్ చేసింది క్రికెట్ డాట్ కామ్ డాట్ ఏయూ. ఇప్పుడీ వీడియో అందరికీ తెగ నచ్చేస్తోంది. ఐసీసీ కూడా దీనిపై స్పందించింది. చాలా మంది ఇదో గోల్డెన్ మూమెంట్ అంటుంటే... కొందరు దీన్ని మూమెంట్ ఆఫ్ ది డే అని మెచ్చుకుంటున్నారు. ఇక ఇది వైరల్ కాకుండా ఎలా ఉంటుంది. చూసినవాళ్లే మళ్లీ మళ్లీ చూస్తున్నారు.


    ఇదే టెస్ట్ రెండో రోజున స్మిత్... వన్ హ్యాండ్‌తో క్యాచ్ పట్టి... కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్‌ను పెవిలియన్ పంపాడు. అది కూడా వైరల్ అయ్యింది.


    దార్ విషయానికొస్తే... ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లకు అంపైర్‌గా చేసిన స్టీవ్ బక్నర్ రికార్డును బ్రేక్ చేశాడు దార్. ఇది దార్ 129 టెస్ట్. 128 టెస్టులకు అంపైర్‌గా బక్నర్ పేరుమీద ఇప్పటివరకూ రికార్డ్ ఉండేది.


    Pics : అందాల తార అర్తనా బిను క్యూట్ ఫొటోస్





    ఇవి కూడా చదవండి :



    CISF ఆఫీసర్ అరెస్ట్... చివర్లో ట్విస్ట్...

    ట్రంప్ గెలుపు బాలీవుడ్ సినిమాలా ఉంటుందన్న జూనియర్ ట్రంప్

    నేడు గొల్లపూడి అంత్యక్రియలు... ప్రముఖుల సంతాపాలు

    ప్రపంచ సుందరిగా టోనీ ఆన్న్ సింగ్... భారత యువతికి మూడో స్థానం

    IND vs WI : వన్డే సిరీస్‌పై టీమిండియా కన్ను... నేడు తొలి మ్యాచ్
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Telugu news, Telugu varthalu

    తదుపరి వార్తలు