NCA HEAD VVS LAXMAN MAY PLAY VITAL ROLE IN INDIAN WOMENS CRICKET AND THIS IS BCCI PLAN FOR WOMENS TEAM SRD
Indian Womens Team : భారత మహిళల జట్టుకు త్వరలోనే మంచి రోజులు.. అదే జరిగితే ఇక తిరుగుండదు..
Indian Womens Team
Indian Womens Team : ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భారత అమ్మాయిల జట్టు లీగ్ స్టేజీలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో మహిళల జట్టులో మార్పులు చేర్పులు చేయడానికి సిద్ధమైంది బీసీసీఐ. భవిష్యత్తు కోసం ఓ మోడల్ ను రూపొందించడానికి స్కెచ్ వేస్తోంది.
ఐసీసీ మహిళల ప్రపంచకప్ (Womens World Cup 2022)లో భారత అమ్మాయిల జట్టు (Indian Womens Team) లీగ్ స్టేజీలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. లీగ్ స్టేజీలోనే కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే నెగ్గింది మిథాలీ సేన. ఆట విషయంలో భారత పురుషుల టీమ్‌తో పోటీపడగల సామర్థ్యం భారత వుమెన్స్ టీమ్ సొంతం. కానీ, అసలైన సమయానికొచ్చేసరికి చేతులేత్తేస్తున్నారు అమ్మాయిలు. ఇక, గత ఏడాది భారత మహిళా టీమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న మాజీ క్రికెటర్ రమేశ్ పవార్... కాంట్రాక్ట్ గడువు వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీతోనే ముగిసింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం రమేశ్ పవార్ కావాలంటే మరోసారి ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే బీసీసీఐ మాత్రం కాంట్రాక్ట్ గడువును పొడగించేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో మహిళా క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ పొజిషన్‌ను అప్లికేషన్స్, ఇంటర్వ్యూలతో భర్తీ చేయబోతున్నారు. అమ్మాయిల ఆటకు ఆదరణ పెరుగుతుండటంతో భారత మహిళా టీమ్‌ను పటిష్టంగా మార్చేందుకు అవసరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు సిద్ధమవుతోంది బీసీసీఐ.
వీవీఎస్ లక్ష్మణ్
కావాలంటే రమేశ్ పవార్ మరోసారి ఈ పదవికి అప్లై చేసి, క్రికెట్ అడ్వైసరీ కమిటీ ముందు ఇంటర్వ్యూకి హాజరుకావలసి ఉంటుంది. అయితే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా ఉన్న భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, భారత మహిళా జట్టుకు అవసరమైన మెరుగులు దిద్దేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వీవీఎస్ లక్ష్మణ్ కు అమ్మాయిల క్రికెట్ ను మెరుగుపర్చేందుకు అవసరమైన అధికారం బీసీసీఐ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాది అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో, దీర్ఘకాలంలో భారత మహిళల జట్టు మెరుగుపర్చేందుకు 'మోడల్'ను రూపొందించడంలో వీవీఎస్ లక్ష్మణ్ పెద్ద పాత్ర పోషించడంతో పాటు తదుపరి తరం ఆటగాళ్లను రూపొందించాలని బీసీసీఐ కోరుకుంటోంది.
లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులో ఎన్‌సీఏ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో భారత అండర్ 19 టీమ్, ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీ గెలిచింది. ఇప్పుడు వీవీఎస్ ఫోకస్ అమ్మాయిల క్రికెట్ పై పడినట్టు సమాచారం. ఇదే జరిగితే.. భారత మహిళల జట్టు స్వరూపమే మారనుంది.
ఇక, అనుభవజ్ఞులైన మిథాలీ రాజ్, జులన్ గోస్వామి స్థానాలు భర్తీ చేయడం బీసీసీఐ ముందు ఉన్న అతిపెద్ద సవాల్. ఇక, వచ్చే ఏడాది ఆరు జట్లతో మహిళా ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగే అవకాశం ఉంది. దీంతో, ఈ ప్రీమియర్ లీగ్ ద్వారా భారత మహిళల జట్టు రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఈ లీగ్ ద్వారా మంచి క్రికెటర్లు వెలుగులోకి వస్తే.. అంతకన్నా శుభాపరిణామం మరొకటి ఉండదు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.