Home /News /sports /

NBA INDIA GAMES MATCH BETWEEN SACRAMENTO KINGS AND INDIANA PACERS MATCH START BY NITA AMBANI MK

'మ్యాచ్ బాల్' అందించి అధికారికంగా ఎన్‌బీఏ టోర్నీ ప్రారంభించిన నీతా అంబానీ

ఎన్బీఏ నిర్వాహకులకు మ్యాచ్ బాల్ అందిస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ

ఎన్బీఏ నిర్వాహకులకు మ్యాచ్ బాల్ అందిస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ

ఎన్‌బీఏను భారతదేశానికి అధికారికంగా ఆహ్వానిస్తూ ఈ ప్రారంభోత్సవ 'మ్యాచ్‌ బాల్'ను ఎన్‌బీఏ కమిషనర్ ఆడమ్ సిల్వర్ కు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ అందించారు. ఈ కార్యక్రమంలో ఇండియానా పేసర్స్ కు చెందిన మైల్స్ టర్నర్ , అలాగే సాక్రమెంటో కింగ్స్ కు చెందిన డీ ఆరోన్ ఫాక్స్ పాల్గొన్నారు.

ఇంకా చదవండి ...
  ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న క్రీడా ప్రియుల కలల టోర్నీ ఎన్‌బీఏ లీగ్‌ భారత్‌లో ప్రారంభమైంది. తొలిసారి భారత గడ్డపై బాస్కెట్ బాల్ వీరుల ప్రదర్శన చూసి అభిమానులు ఉప్పొంగిపోయారు. ముంబై వేదికగా నిర్వహిస్తున్న రెండు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల్లో ఒకటి శుక్రవారం పూర్తయింది. తొలి మ్యాచ్‌లో ఇండియానా పేసర్స్‌ 132-131 తేడాతో శాక్రమెంటో కింగ్స్‌ను ఓడించడం విశేషం. రానున్న కొత్త సీజన్‌కు ముందు ఈ మ్యాచ్‌లను సన్నాహకంగా నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ వీక్షించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ స్కూల్స్ నుంచి 3 వేల మంది విద్యార్థులకు ఈ మ్యాచ్‌ను చూసే అవకాశం దక్కింది. భారత్‌లో ఎన్‌బీఏకు ఉన్న ఆదరణ నేపథ్యంలో ఈ మ్యాచులకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ సహకారం అందించింది.

  ఇదిలా ఉంటే మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్‌లో తొలిసారి జరుగుతున్న ఎన్‌బీఏ టోర్నమెంట్‌లో రిలయెన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ చేతుల మీదుగా ప్రారంభమైంది. తద్వారా ఆమె దేశంలోనే తొలి సారి ఎన్బీఏ బాస్కెట్ బాల్ పోటీలను ప్రారంభించిన  ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. ఇండియానా పేసర్స్ వర్సెస్ సాక్రమెంటో కింగ్స్ మధ్య జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ప్రారంభోత్సవ మ్యాచ్‌ బాల్ ను నీతా అంబానీ టోర్నీ నిర్వాహకులకు అందించారు. ఎన్‌బీఏను భారతదేశానికి అధికారికంగా ఆహ్వానిస్తూ ఈ ప్రారంభోత్సవ 'మ్యాచ్‌ బాల్'ను నీతా అంబానీ నిర్వహకులు ఎన్‌బీఏ కమిషనర్ ఆడమ్ సిల్వర్ కు అందించారు. ఈ కార్యక్రమంలో ఇండియానా పేసర్స్ కు చెందిన మైల్స్ టర్నర్ , అలాగే సాక్రమెంటో కింగ్స్ కు చెందిన డీ ఆరోన్ ఫాక్స్ పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా ఎన్‌బీఏను ఇండియాకు తీసుకురావడాన్ని రిలయెన్స్ ఫౌండేషన్ గర్వంగా భావిస్తోందని నీతా అంబానీ పేర్కొన్నారు. గత 6 సంవత్సరాలుగా రిలయన్స్ ఫౌండేషన్ ఎన్‌బీఏతో కలిసి పనిచేస్తోందని. గడిచిన ఈ సంవత్సరాల్లో 20 రాష్ట్రాల్లోని 34 పట్టణాలకు చెందిన 1.1 కోట్ల మంది పిల్లలకు ఈ గేమ్‌ను పరిచయం చేశామని, తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద జూనియర్ ఎన్‌బీఏ ప్రోగ్రామ్‌గా పేరు తెచ్చుకోవడం మరో విశేషమని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బాస్కెట్ బాల్‌ను చేర్చడం ద్వారా యువత ఆరోగ్యకరమైన, చురుకైన జీవితాన్ని పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని అభిప్రాయపడ్డారు.

  ఎన్బీఏ నిర్వాహకులకు మ్యాచ్ బాల్ అందిస్తున్న రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ
   

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Nba, Nita Ambani, Sports

  తదుపరి వార్తలు