National Sports Awards : రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా విజేతలను అవార్డులను అందుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ అచంట శరత్ కమల్ (Sharath Kamal) అందుకున్నాడు. ఇక అర్జున అవార్డును ఏకంగా 25 మంది క్రీడాకారులు స్వీకరించారు. అర్జున అవార్డును అందుకున్న వారిలో మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ ఉండటం విశేషం. అర్జున అవార్డును అందుకున్న వారిలో చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద కూడా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఆర్ ప్రజ్ఞానంద పలుమార్లు చెస్ స్టార్ మాగ్నస్ కార్లసన్ పై గెలుపొంది అందరినీ తనవైపునకు తిప్పుకున్నాడు.
ఆమెతో పాటు తెలంగాణ నుంచి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ కూడా ఈ పురస్కారాన్ని అందుకుంది. భారత క్రీడా మంత్రిత్వ శాఖ నవంబర్ 14న ఈ ఏడాదికి సంబంధించిన క్రీడా పురస్కారల వివరాలను ప్రకటించింది. రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది క్రికెట్ నుంచి దినేష్ లాడ్ ఒక్కరే క్రీడా పురస్కారం అందుకున్నారు.
President Droupadi Murmu presents the Arjuna award to Boxer Nikhat Zareen at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/5RRFpXD7Z8
— ANI (@ANI) November 30, 2022
President Droupadi Murmu presents the Arjuna award to Chess player R Praggnanandhaa at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/1OPxS7DaoW
— ANI (@ANI) November 30, 2022
విజేతల జాబితా:
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు: ఆచంట శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్).
అర్జున అవార్డులు నెగ్గిన క్రీడాకారులు: నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్) , ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్), సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ (బాక్సింగ్),
ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ విభాగంలో కోచ్‌లకు): జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా-షూటింగ్) మరియు సుజిత్ మాన్ (రెజ్లింగ్)
జీవితకాల పురస్కారం: దినేష్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్)
ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు: అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్వీర్ సింగ్ (హాకీ), బిసి సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్)
నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ అవార్డు: ట్రాన్స్ స్టేడియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లడఖ్ స్కీ అండ్ స్నోబోర్డ్ అసోసియేషన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Draupadi Murmu, Nikhat Zareen, President of India, Sports, Telangana