హోమ్ /వార్తలు /క్రీడలు /

Nisha Dahiya : మహిళా రెజ్లర్ నిషా దహియా, ఆమె సోదరుడు దారుణ హత్య.. ఇందులో నిజమెంత..?

Nisha Dahiya : మహిళా రెజ్లర్ నిషా దహియా, ఆమె సోదరుడు దారుణ హత్య.. ఇందులో నిజమెంత..?

Nisha Dahiya

Nisha Dahiya

Nisha Dahiya : నిషా దహియా అండర్ 23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిషా దహియా ఘనతను అభినందించారు.

హరియాణా సోనిపట్ లో దారుణం జరిగింది. జాతీయ స్థాయి రెజ్లర్ నిషా దహియా మరియు అతని సోదరడుని సుశీల్ కుమార్ అకాడమీలో దుండుగులు కాల్చి చంపారు. హరియాణా రెజ్లింగ్ అకాడమీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిషా దహియా అమ్మ కు కూడా తీవ్రగాయాలయ్యాయ్. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక రోహ్ తక్ ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. నిషా దహియా, ఆమె సోదరడు శవాలను సోన్ పట్ లో ఉన్న సివిల్ ఆస్పత్రికి పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. ఈ దారుణం చేసిన దుండుగులు ఇంకా ఎవరో తెలియలేదు. స్థానిక పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు మొదలుపెట్టారు.

నిషా దహియా అండర్ 23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిషా దహియా ఘనతను అభినందించారు. 2014, 2015 సంవత్సారాల్లో వరుసగా నేషనల్ ఛాంపియన్ గా అవతరించింది నిషా దహియా. ఆసియా చాంపియన్ షిప్ లో కూడా కాంస్య పతకం సాధించింది.

అయితే, నిషా దహియా మరణ వార్త ను ఖండించారు సాక్షి మాలిక్. నిషా దహియా బ్రతికే ఉన్నారని.. ఈ వార్త ఫేక్ అని ట్వీట్ చేశారు.

First published:

Tags: Crime news, Gun fire, Haryana, Wrestling