• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • NATIONAL LEVEL BOXING CHAMPION ABID KHAN TURNS AUTO DRIVER HEARTBREAKING VIDEO GOES VIRAL GH SRD

Viral Video : ఒకప్పుడు బాక్సింగ్​ ఛాంపియన్​..ఇప్పుడు ఆటో డ్రైవర్..సాయం చేయడానికి ముందుకొచ్చిన స్టార్ హీరో..

Viral Video : ఒకప్పుడు బాక్సింగ్​ ఛాంపియన్​..ఇప్పుడు ఆటో డ్రైవర్..సాయం చేయడానికి ముందుకొచ్చిన స్టార్ హీరో..

Photo Credit : You Tube

Viral Video : ఈ హృదయవిదారక వీడియో ఇప్పుడు నెటిజన్లలో చర్చకు దారితీసింది. 17 నిమిషాల నిడివి గల ఈ క్లిప్​లో ఈ మాజీ నార్త్ ఇండియా బాక్సింగ్​ ఛాంపియన్​ అబిద్​ ఖాన్​ తన బాధను నెటిజన్లతో పంచుకున్నాడు.

  • Share this:
ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతల కారణంగా చాలా మంది క్రీడాకారులు ఏదో ఒక పనిచేస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. వారిని ఆదుకొని అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోవడంతో పొట్ట కూటి కోసం రోజూ వారి కూలీలుగా మారుతున్నారు. తాజాగా, ఇటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. మాజీ జాతీయ బాక్సింగ్ ఛాంపియన్​​ ఆబిద్​ ఖాన్​​ దుస్థితి ఇప్పుడు నెట్టింట్లో వైరల్​గా మారుతోంది. ఎన్​ఐఎస్ పాటియాలాలో శిక్షణ పొందిన ఆయన మంచి కోచ్​గా ఎందరో యువ బాక్సర్లను తీర్చిదిద్దాల్సిన సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక ఆటోవాలాగా మారాడు. భారతదేశంలోని చాలా మంది క్రీడాకారుల దుస్థితికి ఇది నిలువుటద్దంగా నిలుస్తోంది. ఒకప్పటి బాక్సింగ్​ ఛాంపియన్​ ఇప్పుడు ఆటో నడుపుతున్న వీడియోను ‘స్పోర్ట్స్ గావ్’ అనే ప్రముఖ యూట్యూబ్ ఛానల్​ షేర్​ చేసింది. ఈ హృదయవిదారక వీడియో ఇప్పుడు నెటిజన్లలో చర్చకు దారితీసింది. 17 నిమిషాల నిడివి గల ఈ క్లిప్​లో ఈ మాజీ నార్త్ ఇండియా బాక్సింగ్​ ఛాంపియన్​ అబిద్​ ఖాన్​ తన బాధను నెటిజన్లతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘‘1988–89 మధ్య కాలంలో నేను నేషనల్​ ​ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ స్పోర్ట్స్​లో శిక్షణ పొందాను. అనంతరం ప్రొఫెషనల్​గా ఐదేళ్ల పాటు ఆర్మీ బాక్సింగ్​ జట్లకు శిక్షణ కూడా ఇచ్చాను. బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో పంజాబ్​ విశ్వవిద్యాలయంలో కోచ్​గా కూడా వ్యవహరించాను. ఎంతో మంది యువకులకు శిక్షణనిచ్చి బాక్సర్లుగా తీర్చిదిద్దాను. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించపోవడంతో ఇప్పుడు ఆటో డ్రైవర్​గా జీవనం సాగిస్తున్నాను”అని అన్నాడు.

భారత క్రీడాకారుల దుస్థితికి నిదర్శనం..
కాగా. బాక్సింగ్​లో ఎన్నో మెళకువలు తెలిసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే సమయంలో కుటుంబ పరిస్థితులు అతడ్ని ఆటో డ్రైవర్​గా మార్చేశాయి. ఆర్థిక సమస్యల కారణంగా బాక్సింగ్​ శిక్షణను కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం బతుకుదెరువు కోసం ఆటో నడపడం, ధాన్యం బస్తాలను మార్కెట్​కు తీసుకురావడం వంటి పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు.

తాను జాతీయ బాక్సర్​ అయినప్పటికీ.. తాను పడుతున్న ఇబ్బందులు తన ఇద్దరు కుమారులు పడకూడదని భావించి వారిని బాక్సింగ్​ వైపు ప్రోత్సహించలేదు. అయితే, తాను తిరిగి బాక్సింగ్​ కోచ్​గా మారాలని ఆశిస్తున్నాడు. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా అలా చేయలేకపెతున్నట్లు వాపోయాడు. ఈ వీడియో వివిధ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​లలో వైరల్​గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


ఎంతో ప్రతిభ ఉన్న ఈ జాతీయ బాక్సర్​ దుస్థితిని చూసి చలించిపోయి కొంత మంది తమకు తోచిన సాయం చేసేందుకు ముందుకొస్తుండగా.. మరికొందరు మాత్రం ఇటువంటి వారిని ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ కూడా అబిద్​ ఖాన్​ దుస్థితిపై స్పందిస్తూ “జాతీయ బాక్సింగ్​ ఛాంపియన్​ అబిద్ ఖాన్ దుస్థితి నన్ను ఎంతగానో కలిగిచివేసింది. ఆయన కల నెరవేర్చుకోవడంలో ఆర్థిక సమస్యలు అడ్డంకిగా మారడం అత్యంత బాధాకరం. దయచేసి ఆయన వివరాలను పంపించగలరు.” అని ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ సౌరభ్ దుగ్‌గావ్​ను కోరారు. అయితే, ఖాన్ ఆర్థిక సహాయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడని, అతను తిరిగి బాక్సింగ్​ కోచ్​గా రావాలని కోరుకుంటున్నాడని పేర్కొన్నాడు.
Published by:Sridhar Reddy
First published: