• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • NATASA STANKOVIC SHARES A CUTE VIDEO OF HARDIK PANDYA SHOWERING THEIR SON AGASTYA WITH LOVE SRD

Viral Video : లాహిరి..లాహిరి..లాహిరిలో..కొడుకు తో ఎంజాయ్ చేస్తోన్న హార్థిక్ పాండ్యా..

Viral Video : లాహిరి..లాహిరి..లాహిరిలో..కొడుకు తో ఎంజాయ్ చేస్తోన్న హార్థిక్  పాండ్యా..

Photo Credit : Instagram

Viral Video : ఈ మధ్య ఎక్కువగా కొడుకు అగస్త్యకి సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని ఎక్కువగా షేర్ చేస్తున్నారు ఈ భార్య భర్తలు. ఇక, లేటెస్ట్ గా నటాషా.. హార్దిక్ , కొడుకు అగస్త్య కు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

  • Share this:
    టీమిండియా క్రికెటర్.. ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. అతని భార్య నటాషా స్టాన్ కోవిచ్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ దంపతులిద్దరూ.. తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ.. ఫ్యాన్స్ ను అలరిస్తుంటారు. ఈ మధ్య ఎక్కువగా కొడుకు అగస్త్యకి సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని ఎక్కువగా షేర్ చేస్తున్నారు ఈ భార్య భర్తలు. ఇక, లేటెస్ట్ గా నటాషా.. హార్దిక్ , కొడుకు అగస్త్య కు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. " నా సర్వస్వం " అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఆ వీడియో చాలా క్యూట్ గా ఉంది. కొడుకుతో కలిసి హార్దిక్ ఆడుకుంటున్నాడు. హార్దిక్ హావభావాలు.. దానికి అగస్త్య రియాక్షన్ చాలా క్యూట్ గా ఉంది. దీంతో... ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ పోస్టుకి హార్దిక్ కూడా కామెంట్ రూపంలో స్పందించాడు. హార్దిక్ కూడా "నా సర్వస్వం" అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. కొద్దిరోజుల క్రితం కూడా నటాషా ఓ ఫోటో షేర్ చేయగా అది కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. స్విమ్మింగ్ పూల్ లో కొడుకుతో కలిసి నటాషా ఆడుకుంటోంది. ఆ ఫోటోకి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

    ఇదిలా ఉండగా.. హార్దిక్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తో ఉన్నాడు. హార్దిక్ తో పాటు నటాషా, అగస్త్య కూడా బయో సెక్యూర్ బబుల్ లో ఉన్నారు. అయితే, ఇవాళ ఐపీఎల్ 2021 సీజన్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. కరోనా ఎఫెక్ట్ తో ఈ సీజన్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.






    ఆటగాళ్లను.. సురక్షితంగా తమ ఇళ్లకు చేర్చే బాధ్యత తమదని బీసీసీఐ ప్రకటించింది. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ లో మొదలైన కరోనా కలవరం.. మిగతా అన్ని జట్లలోనూ బయటపడింది. ఇవాళ.. ఢిల్లీ క్యాపిటల్స్ లోనూ కరోనా పాజిటివ్ నిర్థారణ అవ్వడంతో.. ఆటగాళ్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని..ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు