నవోమీ ఒసాకా... టెన్నిస్ ప్రపంచంలో సంచలనం!

యూఎస్ ఓపెన్ చరిత్రలో ఎన్నో సంచలనాలు సృష్టించింది నవోమీ. అసలు అంచనాలు లేకుండా వచ్చిన నవోమీ... ప్రీ క్వార్టర్ ఫైనల్ దాటితేనే గొప్ప అనుకున్నారు. కానీ ఫైనల్‌కు చేరింది. తన అభిమాన ప్లేయర్ అయిన సెరెనాను ఫైనల్‌లో ఓడించింది.

Santhosh Kumar S | news18-telugu
Updated: September 9, 2018, 8:34 AM IST
నవోమీ ఒసాకా... టెన్నిస్ ప్రపంచంలో సంచలనం!
నవోమీ ఒసాకా ( AP PHOTO )
  • Share this:
1995 అక్టోబర్ 28... అప్పుడు 14 ఏళ్ల సెరెనా విలియమ్స్ తొలి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడిన రోజు.
1997 అక్టోబర్ 16... యూఎస్ ఓపెన్ మహిళల టైటిల్ విజేత నవోమీ ఒసాకా పుట్టినరోజు.

అంటే... సెరెనా విలియమ్స్ ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడే సమయానికి నవోమీ ఒసాకా పుట్టలేదు. అంటే... సెరెనా విలియమ్స్ అనుభవం అంత లేదు ఒసాకా వయస్సు. కానీ ఇప్పుడు అంత అనుభవజ్ఞురాలైన సెరెనాను ఫైనల్ మ్యాచ్‌లో గడగడలాడించింది 20 ఏళ్ల ఒసాకా.

నవోమీ ఒసాకా... జపనీస్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. ఆమెకు అమెరికన్ సిటిజన్‌షిప్‌ కూడా ఉంది. తొలి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ గెలిచిన జపాన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిందిప్పుడు. జపనీస్ తల్లి, హైతియన్ తండ్రికి పుట్టిన నవోమీ జపాన్‌లోనే నివసిస్తోంది. నవోమీ సోదరి మారీ కూడా టెన్నిస్ ప్లేయరే. ఇధ్దరూ డబుల్స్ మ్యాచ్‌లు ఆడారు. జపాన్ టెన్నిస్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేసుకున్న నవోమీ... 2013లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారింది. నవోమీ రోల్ మోడల్ ఎవరో కాదు... సెరెనా విలియమ్సే.

రాకెట్ పట్టిన తొలి రోజు నుంచి సెరెనాను అభిమానిస్తోంది. 2014లో ఓ సందర్భంలో సెరెనాతో సెల్ఫీ దిగి మురిసిపోయింది. ఇప్పుడు అదే సెరెనాను యూఎస్ ఓపెన్ వుమెన్స్ ఫైనల్‌లో ఓడించి చరిత్ర సృష్టించింది.


నవోమీ రాకెట్ పట్టిన తొలినాళ్ల నుంచే సంచలన ప్లేయర్‌గా రికార్డులు సృష్టించింది. 2015లో టాప్-50 ర్యాంకింగ్‌లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ద్వారా గ్రాండ్‌స్లామ్‌లో అడుగుపెట్టి... థర్డ్ రౌండ్ వరకు వెళ్లింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా థర్డ్ రౌండ్‌కు చేరుకుంది. 2016 యూఎస్ ఓపెన్‌లో కూడా థర్డ్ రౌండ్ వరకు వెళ్లింది. 2017లో వింబుల్డన్‌లో అడుగుపెట్టింది. థర్డ్ రౌండ్‌లో వీనస్ విలియమ్స్ చేతిలో ఓడిపోయింది. 2018లో ప్రారంభంలో నవోమీ ర్యాంక్ 68. కానీ కొన్ని నెలల్లోనే ఏకంగా 7వ ర్యాంకు వరకు వచ్చేసింది.

serena-williams_naomi-osaka
సెరెనా విలియమ్స్, నవోమీ ఒసాకా ( US Open tennis/Twitter )
2018 మార్చిలో మియామీ ఓపెన్‌లో తన అభిమాన ప్లేయర్ సెరెనా విలియమ్స్‌తో తొలిరౌండ్‌లో పోటీపడింది. వాస్తవానికి సెరెనాకు నవోమీ తొలిసారిగా చుక్కలు చూపించింది అక్కడే. ఆ మ్యాచ్‌లో సెరెనాపై 6-3, 6-2 తేడాతో గెలిచి సంచలనం సృష్టించింది నవోమీ. అప్పుడు సెరెనా విలియమ్స్ ర్యాంక్ నెంబర్ 1 అయితే ఒసాకా ర్యాంక్ 22. ఇప్పుడు మరోసారి సెరెనాపై పైచేయి సాధించింది. అది కూడా ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో. ఫైనల్ మ్యాచే కాదు... 137 ఏళ్ల యూఎస్ ఓపెన్ చరిత్రలో ఎన్నో సంచలనాలు సృష్టించింది నవోమీ. అసలు అంచనాలు లేకుండా వచ్చిన నవోమీ... ప్రీ క్వార్టర్ ఫైనల్ దాటితేనే గొప్ప అనుకున్నారు. కానీ ఫైనల్‌కు చేరింది. తన అభిమాన ప్లేయర్ అయిన సెరెనాతో ఫైట్‌కు రెడీ అయింది.

23 సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన సెరెనా ఒకవైపు... తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన నవోమీ ఒకవైపు... ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో ఎవరైనా సులువుగా ఊహించొచ్చు. సెరెనాదే విజయం అనుకున్నారు. ఆమె ఖాతాలో 24వ గ్రాండ్‌స్లామ్ ఖాయం అనుకున్నారు. కానీ అలా జరిగితే అది ఆట ఎందుకవుతుంది? మ్యాచ్‌లో మజా ఏముంటుంది? ఫైనల్ మ్యాచ్ ఊహించని విధంగా సాగింది. చివరకు సెరెనాను 6-2, 6-4 తేడాతో ఓడించింది ఒసాకా.


తను పుట్టడానికన్నా రెండేళ్ల ముందే ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడిన సెరెనాను ఖంగుతినిపించింది 20 ఏళ్ల నవోమీ. నాలుగేళ్ల క్రితం సెరెనాతో సెల్ఫీ తీసుకుంటేనే గొప్ప అనుకున్న నవోమీ... ఇప్పుడు ఏకంగా ఆమెను ఫైనల్‌లో ఓడించి ట్రోఫీని ముద్దాడింది.
Published by: Santhosh Kumar S
First published: September 9, 2018, 8:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading