Home /News /sports /

క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్.. దేశం పట్ల ప్రేమ తగ్గదు

క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్.. దేశం పట్ల ప్రేమ తగ్గదు

యువరాజ్ సింగ్ (BCCI / twitter )

యువరాజ్ సింగ్ (BCCI / twitter )

ఇటీవల రోహిత్ శర్మ‌తో కలిసి యువరాజ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడాడు. ఆ సందర్భంగా చాహల్‌పై సరదాగా కామెంట్ చేశారు యూవీ. చాహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడని..బాంగీ మనుషుల్లా వీళ్లకు పనిపాటా లేదా? వ్యాఖ్యానించారు.

ఇంకా చదవండి ...
    దళితులను కించపరిచేలా యువరాజ్ సింగ్ వ్యాఖ్యలు ఇటీవల పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మతో కలిసి లైవ్లో మాట్లాడుతున్న సమయంలో స్పినర్ యుజ్వేంద్ర చాహల్‌పై కుల వివక్ష వ్యాఖ్యలు చేశాడని.. ఆయనపై పోలీస్ కేసు నమోదయింది. అంతేకాదు యువరాజ్ క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియా డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ట్విటర్ వేదికగా యువరాజ్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే వారందరికీ క్షమాపణ చెబుతున్నామని ట్విట్ చేశారు యువరాజ్ సింగ్.

    కులం, రంగు, మతం, లింగం వంటి వ్యత్యాస్యాలను నేను పట్టించుకోనని, విశ్వసించనని మీ అందరికి స్పష్టంగా తెలియజేస్తున్నా. నేను ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే పరితపిస్తాను. ప్రతీ ఒక్కరికి గౌరవం ఇవ్వాలని, ఒకరికొకరం మర్యాదగా నడుచుకోవాలని భావిస్తా. నా సహచరులతో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమైంది. ఏది ఏమైనా బాధ్యాతాయుతమైన భారతీయుడిగా నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే వారందరికి క్షమాపణలు తెలియజేస్తున్నా. నా వ్యాఖ్యల పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నా. దేశం, ప్రజల పట్ల నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు.
    యువరాజ్ సింగ్



    ఇటీవల రోహిత్ శర్మ‌తో కలిసి యువరాజ్ సింగ్ ఇన్‌స్టగ్రామ్ లైవ్‌లో మాట్లాడాడు. ఆ సందర్భంగా చాహల్‌పై సరదగా కామెంట్ చేశారు యూవీ. చాహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడని..బాంగీ మనుషుల్లా వీళ్లకు పనిపాటా లేదా? వ్యాఖ్యానించారు. ఆ మాటలకు రోహిత్మ నవ్వి ఊరుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దళితులను కించపరిచేలా యువరాజ్ మాట్లాడాడని.. నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. యువరాజ్ సింగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

    అంతేకాదు యువరాజ్‌పై హర్యానాలో కేసు నమోదయింది. యువరాజ్ సింగ్‌పై దళిత హక్కుల నేత కల్సన్ హర్యానాలో హిస్సార్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళితులను కించపరిచేలా ఆయన మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువరాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యువరాజ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కాపీలను పోలీసులకు అందజేశారు. అంతేకాదు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను కూడా రజత్ కల్సన్ టార్గెట్ చేశారు. యువరాజ్ అంత మాట అన్నా.. రోహిత్ ఎందుకు అడ్డు చెప్పలేదని ప్రశ్నించారు. అందుకే ఆయనపైనా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐతే ఈ వివాదం ముదరడంతో యువరాజ్ సింగే దిగొచ్చి.. అందరికీ క్షమాపణలు చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Rohit sharma, Team india, Yuvraj Singh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు