Murali Vijay Retirement : భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, తమిళనాడు (Tamil Nadu) బ్యాటర్ మురళీ విజయ్ (Murali Vijay) అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం (జనవరి 30న) ప్రకటించాడు. తన రిటైర్మెంట్ కు సంబంధించిన ఒక నోట్ ను ట్వీట్టర్ లో పోస్ట్ చేసిన విజయ్.. అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. 2002 నుంచి 2018 మధ్య తన క్రికెట్ జర్నీ అత్యంత అద్భుతంగా సాగిందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. 2008లో భారత్ తరఫున విజయ్ అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ కెరీర్ ను ఆరంభించాడు. సరిగ్గా రెండేళ్ల తర్వాత వన్డే, టి20ల్లోనూ భారత్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు.
టెస్టు ప్లేయర్ గా ఎంట్రీ ఇచ్చిన మురళీ విజయ్.. 2010 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బ్యాట్ రాణించాడు. 15 మ్యాచ్ లు ఆడిన మురళీ విజయ్ 458 పరుగులు చేశాడు. ఇందులో 127 పరుగుల సునామీ ఇన్నింగ్స్ తో విజయ్ కి మంచి పేరు వచ్చింది. ఆ వెంటనే వన్డే, టి20ల్లో కూడా అడుగుపెట్టాడు. అయితే నిలకడైన ఆటతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. అప్పుడప్పుడు మెరవడమే తప్ప నిలకడగా రాణించింది లేదు. ఇక 2015లో తన ఆఖరి వన్డే, టి20 మ్యాచ్ లను ఆడిన విజయ్.. 2018లో చివరి టెస్టు మ్యాచ్ ను ఆడాడు. ఆ తర్వాత మళ్లీ భారత్ తరఫున పిలుపు అందుకోలేకపోయాడు. ఐపీఎల్ లో 2020లో కేవలం 3 మ్యాచ్ లు ఆడిన అతడు.. 2021 నుంచి ఐపీఎల్ కు కూడా దూరమయ్యాడు.
ఓవరాల్ కెరీర్ లో 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టి20లు ఆడాడు. టెస్టుల్లో 12 సెంచరీలు.. 15 అర్ధ సెంచరీలతో 3,982 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో హాఫ్ సెంచరీ సాయంతో 339 పరుగులు చేశాడు. టి20ల్లో 169 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో 106 మ్యాచ్ ల్లో 2,619 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
@BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK
— Murali Vijay (@mvj888) January 30, 2023
ఇక ఈ మధ్య కాలంలో విజయ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియన్ క్రికెట్ లో 30 ఏళ్లు దాటితో 80 ఏళ్లు దాటినట్లుగా భావిస్తారంటూ బాంబు పేల్చాడు. తాజాగా అతడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అయితే అతడు లీగ్ క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశాల్లో జరిగే లీగ్స్ ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Chennai Super Kings, Team India