హోమ్ /వార్తలు /క్రీడలు /

Neeraj Chopra : " దేశానికి పతకం తెచ్చిన వ్యక్తి ముందు అసభ్యకర డ్యాన్సులా ".. నీరజ్ చోప్రా ఫ్యాన్స్ ఆన్ ఫైర్..

Neeraj Chopra : " దేశానికి పతకం తెచ్చిన వ్యక్తి ముందు అసభ్యకర డ్యాన్సులా ".. నీరజ్ చోప్రా ఫ్యాన్స్ ఆన్ ఫైర్..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Neeraja Chopra :శతాబ్దాల భారత్ కలను నెరవేరుస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకం పట్టేశాడు నీరజ్ చోప్రా. అతని విజయం దేశం మొత్తానికి స్ఫూర్తివంతంగా నిలిచింది. సోషల్ మీడియా మొత్తం నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఇక, టోక్యో ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చినప్పటినుంచి నీరజ్ చోప్రా పలు ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతున్నాడు.

ఇంకా చదవండి ...

నీరజ్ చోప్రా.. (Neeraj Chopra) దేశ వ్యాప్తంగా ఇప్పుడు మార్మోగిపోతున్న పేరు ఇది. ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు దేశ యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. హర్యానాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రాకు పలు రాష్ట్రాలు, సంస్థలు భారీ నజరానాలు ప్రకటించాయి.. ప్రకటిస్తూనే ఉన్నాయి. శతాబ్దాల భారత్ కలను నెరవేరుస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకం పట్టేశాడు నీరజ్ చోప్రా. అతని విజయం దేశం మొత్తానికి స్ఫూర్తివంతంగా నిలిచింది. సోషల్ మీడియా మొత్తం నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఇక, టోక్యో ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చినప్పటినుంచి నీరజ్ చోప్రా పలు ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అతడ్ని ఇంటర్వ్యూ చేసేందుకు పలు మీడియా సంస్థలు తెగ ఉత్సాహం చూపిస్తున్నాయ్.ముంబైకి చెందిన రెడ్ ఎఫ్ఎమ్ కూడా తాజాగా నీర‌జ్‌ను ఇంట‌ర్వ్యూ చేసింది. పాపుల‌ర్ ఆర్జే మ‌లిష్కా మెండోన్సా వీడియో కాల్ (జూమ్‌ యాప్‌) ద్వారా నీర‌జ్‌ను ఇంట‌ర్వ్యూ చేసింది. అయితే ఇంట‌ర్వ్యూ స్టార్ట్ కావ‌డానికి ముందు ఆర్జే మ‌లిష్కా త‌న తోటి ఉద్యోగుల‌తో క‌లిసి ఓ పాత హిందీ పాట‌కు డ్యాన్స్ చేసింది. 'ఉడే జ‌బ్ జ‌బ్ జుల్ఫే తేరీ' సాంగ్‌కు ఆర్జే అమ్మాయిలు స్టెప్పులేశారు. నీర‌జ్ వీడియో కాల్ ద్వారా లైవ్‌లో ఉన్న‌ప్పుడే వాళ్లంతా చిందేశారు. ఆపై నీరజ్‌కు ఆమె కొన్ని ప్రశ్నలు వేసింది.

ఆర్జే మ‌లిష్కా త‌న ట్విట్ట‌ర్‌లో ఆ డ్యాన్స్‌కు చెందిన వీడియోను కూడా పోస్టు చేసింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆన్‌లైన్‌లో విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఫిమేల్ గెస్ట్‌తో ఓ మేల్ ఆర్జే ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తే దాన్ని లైంగిక వేధింపుగా ఆరోపిస్తార‌ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ఆర్జేలు త‌క్ష‌ణ‌మే ఆ వీడియోను డిలీట్ చేయాల‌ని ఇంకొకరు ట్వీటారు. 'దేశానికి పతకం తెచ్చిన వ్యక్తితో ఇలాగేనా ప్రవర్తించేది', 'మీ ప్రవర్తనతో తల దించుకునేలా చేశారు', 'అతనికి మీరిచ్చే గౌరవం ఇదేనా' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. నీర‌జ్‌ను అవ‌మాన‌ప‌రిచినందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కొంద‌ర‌న్నారు. ఆ టీమ్‌ను ఆ రేడియో స్టేష‌న్ తొల‌గించాల‌ని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు. నెట్టింట పలు మీమ్స్‌తో ఆర్జే టీమ్‌ను ట్రోల్ చేశారు. దీంతో ట్విట్ట‌ర్ ఇండియాలో మ‌లిష్కా ట్రెండ్ అయ్యింది.

నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌ 2020లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్‌ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్‌ రెండో రౌండ్‌లో 87.58 మీటర్లు విసిరి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్‌ ముగింపు ఇచ్చాడు. పారిస్ ఒలింపిక్స్ లోనూ ఇదే ప్రదర్శనతో సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నాడు నీరజ్ చోప్రా.

First published:

Tags: Mumbai, Sports, Tokyo Olympics

ఉత్తమ కథలు