MI vs PBKS: పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం.. ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన ముంబై

పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్ (PC: IPL)

MI vs PBKS: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. పంజాబ్‌ కింగ్స్‌పై ఆల్‌రౌండ్ షో చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ మరోసారి ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) ప్లే ఆఫ్స్  (IPL Play Offs) రేసులోకి ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వచ్చేసింది. ఈ సీజన్‌లో మంచి విజయాలతో ఆరంభించినా.. యూఏఈలో జరుగుతున్న రెండో దశలో మాత్రం ముంబై జట్టు వరుస ఓటములతో ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకున్నది. అయితే అబుదాబి వేదికగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి తిరిగి పట్టాలపైకి ఎక్కింది. తొలుత బౌలింగ్‌లో అద్బుత ప్రదర్శన చేసి పంజాబ్ జట్టును 135 పరుగులకే కట్టడి చేసింది. కానీ 136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి సరైన ఆరంభం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (8) (Rohit Sharma) రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో మన్‌దీప్ సింగ్‌కు క్యాచ్ నిరాశ పరిచాడు. రవి బిష్ణోయ్ ఆ తర్వాత బంతికే ఫామ్‌లో లేని సూర్యకుమార్ యాదవ్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ముంబై జట్టు కష్టాల్లో పడింది.

    కానీ ఓపెనర్ క్వింటన్ డికాక్, సౌరభ్ తివారి కలసి కాసేపు క్రీజులో పోరాడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు విసురుతున్న కఠినమైన బంతులను ఎదుర్కుంటూ విలువైన 45 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే క్వింటన్ డికాక్ (27) మహ్మద్ షమి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇక అప్పటి వరకు క్రీజులో నిలబడిన సౌరభ్ తివారి (45) కూడా అవుటవడంతో మ్యాచ్ చాలా ఆసక్తికరంగా మారింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు ముంబై బ్యాటర్లు దాసోహం అవుతారా అనిపించింది. అయితే ముంబై ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా (40), కిరాన్ పొలార్డ్ (15) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో విమర్శలు ఎదుర్కుంటున్న హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో తన పాత స్వరూపాన్ని ప్రదర్శించాడు. బౌండరీలు, సిక్సులతో విరుచుకపడ్డాడు. వీరిద్దరూ కలసి మరో వికెట్ పడకుండా మరో ఓవర్ మిగిలి ఉండగానే ముంబై ఇండియన్స్‌కు విజయాన్ని అందించారు. 19 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేయడంతో ముంబైకి 6 వికెట్ల విజయం లభించింది. రవి బిష్ణోయ్ 2 వికెట్లు, మహ్మద్ షమి, నాథన్ ఎల్లిస్ చెరో వికెట్ తీశారు.

    IPL 2021: హోటల్ గదిలోనే డేవిడ్ వార్నర్.. గ్రౌండ్‌కు ఎందుకు రాలేదని ఫ్యాన్స్ అయోమయం.. క్లారిటీ ఇచ్చిన కోచ్




    Kohli - Kishan: టీ20 వరల్డ్ కప్‌పై కోహ్లీ ఆందోళనలో ఉన్నాడా? ముంబై మ్యాచ్ తర్వాత వైరల్‌గా మారిన ఫొటో









    ఈ మ్యాచ్‌లో కీలకమైన వికెట్లు తీసి.. ఆఖర్లో విలువైన పరుగులు చేసిన కిరాన్ పొలార్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ వికెట్ తీయడం ద్వారా కిరాన్ పొలార్డ్ టీ20 ఫార్మాట్‌లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. టీ20 చరిత్రలో 10వేల పరుగులు, 300 వికెట్ల మైలు రాయిని చేరుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా పొలార్డ్ చరిత్ర సృష్టించాడు. ఇక ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువయ్యింది. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిస్తే పల్టన్స్ అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు పంజాబ్ టాప్ 4 బెర్త్ అవకాశాలు మరింత క్లిష్టతరం చేసుకున్నది.
    Published by:John Naveen Kora
    First published: