Home /News /sports /

MUMBAI INDIANS WON BY 42 RUNS AGAINST SUNRISERS HYDERABAD BUT NOT QUALIFIED FOR PLAYOFFS JNK

SRH vs MI: ముంబై ఇండియన్స్ గెలిచింది కానీ.. ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కలేదు.. దెబ్బేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు..

హైదారాబాద్‌పై గెలిచిన ముంబై.. ఆఫ్స్ బెర్త్ మాత్రం దక్కలేదు (PC: IPL)

హైదారాబాద్‌పై గెలిచిన ముంబై.. ఆఫ్స్ బెర్త్ మాత్రం దక్కలేదు (PC: IPL)

SRH vs MI: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 42 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబై జట్టు మ్యాచ్ గెలిచినా.. భారీ తేడాతో విజయం సాధించకపోవడంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేక పోయింది.

    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై జట్టు నిర్దేశించిన 236 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. దీంతో ముంబై 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ మనీశ్ పాండే (69) (Manish Pandey) చివరి వరకు పోరాడినా టార్గెట్‌ను మాత్రం చేరుకోలేక పోయాడు. సన్‌రైజర్స్ జట్టును 64 పరుగుల లోపు కట్టడి చేసి ఉంటే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకునేది. కానీ ఓపెనర్లు 64 పరుగులు బాదేయడంతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకోలేక పోయింది.

    ముంబై నిర్దేశించిన 236 పరుగుల భారీ టార్గెట్ ఛేదించడానికి దిగిన సన్‌రైజర్స్ ఓపెనింగ్ బ్యాటర్లు ధాటిగా ఆడారు. జేసన్ రాయ్, అభిషేక్ శర్మ కలసి ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. వరుసగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ (33) జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో నాథన్ కౌల్టర్-నైల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే జేసన్ రాయ్ (34) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో టార్గెట్ ఛేదించే బాధ్యతను కెప్టెన్ మనీశ్ పాండే భుజాలపై వేసుకున్నాడు.

    RCB vs DC: ఢిల్లీ జోరుకు కళ్లెం వేసిన బెంగళూరు.. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. అద్భుత విజయాన్ని అందించిన భరత్




    మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ పరుగుల వేగాన్ని తగ్గకుండా చూశాడు. అయితే అతడికి మరో ఎండ్‌లో సరైన సహకారం లభించలేదు. మహ్మద్ నబి (3), అబ్దుల్ సమద్ (2) తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరారు. అయితే ప్రియమ్ గార్గ్ కాసేపు క్రీజులో ఉండి మనీశ్‌కు సహకారం అందించాడు. వీరిద్దరూ కలసి 5వ వికెట్‌కు 56 పరుగులు జోడించారు. అయితే ప్రియమ్ గార్గ్ (29) జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత ఒక్కరు కూడా రాణించలేదు. మనీశ్ పాండే ఒక్కడే చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. జేసన్ హోల్డర్ (1), రషీద్ ఖాన్ (9), వృద్దిమాన్ సాహ (1) పూర్తిగా విఫలమయ్యారు.







    మనీశ్ పాండే (69) ఒక్కడే చివరి వరకు పోరాడటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. జస్ప్రిత్ బుమ్రా, నాథన్ కౌల్టర్-నైల్, జేమ్ నీషమ్ తలా 2 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, పీయుష్ చావ్లావకు చెరో వికెట్ దక్కింది. ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: IPL 2021, Mumbai Indians, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు