• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • MUMBAI INDIANS VS CHENNAI SUPER KINGS LIVE SCORE CHENNAI 218 RUNS MUMBAI TARGET 219 SA

CHENNAI VS MUMBAI: చైన్నై భారీ స్కోర్.. రాయుడు సూపర్ బ్యాటింగ్!

CHENNAI VS MUMBAI: చైన్నై భారీ స్కోర్.. రాయుడు సూపర్ బ్యాటింగ్!

KieronPollard

ఐపీఎల్ 2021లో భాగంగా నేడు ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే తలపడతున్నాయి. మెుదటిగా బ్యాటింగ్ చేసిన  చెన్నై  భారీ స్కోర్  సాధించింది

  • Share this:


    ఐపీఎల్ 2021లో భాగంగా నేడు ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే తలపడతున్నాయి. మెుదటిగా బ్యాటింగ్ చేసిన  చెన్నై 218 పరుగుల భారీ స్కోర్‌ను  సాధించింది. . టాస్ ఓడి మెుదటి బ్యాటింగ్ ఆరభించిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు అదిలోనే షాక్‌ తగిలింది. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌ నాల్గో బంతికి సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌ ఔటయ్యాడు. షాక్ ఆడబోయే క్రమంలో బంతి ఎడ్జ్‌ తీసుకుని బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న హార్దిక్‌ పాండ్యాకు చేతిలోకి వెళ్ళింది. దాంతో సీఎస్‌కే 4 పరుగులకే తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆ తర్వాత వచ్చిన మొయిన్‌ అలీ చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో సీఎస్‌కే..10 ఓవర్లలో 95/1 పరుగులు చేసింది. 58 పరుగులు చేసిన అలీ బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత సీఎస్‌కే వరుసగా 2 వికెట్ల నష్టపోయింది. డుప్లెసిస్‌ 48, రైనా 0 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు. పొలార్డ్‌ వేసిన 12వ ఓవర్లో వరుస బంతుల్లో డుప్లెసిస్‌(50), రైనా(2)లు భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ అవుట్‌లుగా వెనుదిరిగారు. తర్వాత రాయుడు(72) హాట్ హిట్టింగ్ చేశాడు.   ఏడు సిక్స్‌లు, నాలుగు బౌండరీలు సాధించాడు,
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు