MUMBAI INDIANS SKIPPER ROHIT SHARMA INSIDE BIRTH CELEBRATIONS PICS GOES VIRAL IN SOCIAL MEDIA SRD
Rohit Sharma : భార్యతో కలిసి రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్..చాహల్ ఏంటి అలా విషెస్ చెప్పాడు..?
Photo Credit : Twitter
Rohit Sharma : క్రికెట్ హిట్ మ్యాన్ .. రోహిత్ శర్మ (Rohit Sharma)ఈ రోజు 34 వ పడిలోకి అడుగుపెట్టాడు. అభిమానులు, క్రికెటర్లు అందరూ సోషల్ మీడియా వేదికగా హిట్ మ్యాన్ కి విషెస్ తెలియజేశారు.
రోహిత్ శర్మ.. (Rohit Sharma) క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. దశాబ్దంగా క్రికెట్ ను కోహ్లీ ఏలుతున్నా.. విరాట్ కు దీటుగా ఆన్, ఆఫ్ ఫీల్డ్ ల్లో క్రేజ్ సంపాందించుకున్నాడు. ముఖ్యంగా అతని సిక్స్ హిట్టింగ్ స్కిల్ కు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈజీగా గ్రౌండ్ బయటికి సిక్సర్లు కొట్టగల సత్తా రోహిత్ ది. ఇక, పుల్ షాట్ ఆడటంలో టీమిండియాలోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా మంది రోహిత్ ను మాస్టర్ ఆఫ్ పుల్ షాట్ అంటారు. ఐపీఎల్ రోహిత్ కున్నా రికార్డు మరి ఏ ప్లేయర్ కూడా లేదు. ఏకంగా ఐదు ఐపీఎల్ కప్ లు సాధించిన ఘనత రోహిత్ శర్మది. అంతేగాక మొత్తం ఆరు కప్ ల్లో సాధించిన టీమ్ ల్లో సభ్యుడిగా రోహిత్ మాత్రమే ఉన్నాడు. అలాంటి హిట్ మ్యాన్ ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. రోహిత్ శర్మ 30 ఏప్రిల్ 1987లో నాగ్‌పూర్‌లో జన్మించాడు. రోహిత్ శర్మ అమ్మ పూర్ణిమ శర్మ సొంత ఊరు విశాఖపట్నం. నాన్న గురునాథ్ శర్మ ఒక ట్రాన్‌పోర్ట్ కంపెనీలో పని చేసేవారు. రోహిత్ శర్మ పెరిగింది ముంబైలోని బోరివలిలోని వాళ్ల నానమ్మ, తాతయ్య దగ్గరే. ఈ రోజు ఆయన 34వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.
అభిమానులు, క్రికెటర్లు అందరూ సోషల్ మీడియా వేదికగా హిట్ మ్యాన్ కి విషెస్ తెలియజేశారు. ఇదిలా ఉండగా... ఈ బర్త్ డే వేడుకులను రోహిత్ శర్మ తన భార్య రితికా, ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి జరుపుకున్నాడు. గురువారం ముంబయి జట్టు రాజస్థాన్ రాయల్స్ తలపడగా.. విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయం తర్వాత.. ముంబయి టీం.. రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను రోహిత్ భార్య రితిక ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆమెతోపాటు.. ముంబయి ఇండియన్స్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా వీటిని షేర్ చేయడం విశేషం.
— Harbhajan Turbanator (@harbhajan_singh) April 30, 2021
Wish you a very Happy Birthday Brotherman @ImRo45 .. Wish you good health, happiness, and loads of success in the coming year & always. 🎉🎉🤗 pic.twitter.com/wpmpmdq3MG
"అతను ఎప్పుడు, ఎక్కడ నడిచినా స్టేజ్ ఫైర్ లో ఉంటుంది. అతని పేరే Ro-HIT Sharma. పుట్టినరోజు శుభాకాంక్షలు, కెప్టెన్. " అంటూ ముంబై ఇండియన్స్ ట్విట్టర్ లో క్యాప్షన్ ఇచ్చింది. అలాగే ఐసీసీ కూడా స్పెషల్ గా రోహిత్ శర్మకు విషెస్ తెలియజేసింది. టీమిండియా మాజీ క్రికెటర్లు, ప్రెజెంట్ ఆటగాళ్లు కూడా రోహిత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే, అందరిలో కల్లా..చిలిపి పిల్లాడు చాహల్ విషెస్ ప్రత్యేకంగా ఉన్నాయ్. మై లవ్ రోహితా శర్మకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చాహల్ ట్వీట్ చేశాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.