• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • MUMBAI INDIANS SKIPPER ROHIT SHARMA FANS TRENDS BOYCOTT SWIGGY AFTER VADAPAV MEME ON HIT MAN SRD

#BoycottSwiggy : స్విగ్గీపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ అన్ ఫైర్.. బ్యాన్ చేయాలని డిమాండ్..ఎందుకో తెలుసా..

#BoycottSwiggy : స్విగ్గీపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ అన్ ఫైర్.. బ్యాన్ చేయాలని డిమాండ్..ఎందుకో తెలుసా..

Photo Credit : Twitter

#BoycottSwiggy : ఐపీఎల్ తాజా సీజన్ అలా ప్రారంభమైందో లేదో.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బాయ్‌కాట్ చేయాలంటూ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. దీనికి వెనుక పెద్ద కారణం ఉంది.

  • Share this:
    ఐపీఎల్ ప్రారంభమైతే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. ఫ్యాన్స్ తో పాటు చాలా కంపెనీలు కూడా ఐపీఎల్ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయ్. ముఖ్యంగా జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు ఈ టైంలో ఇచ్చే ఆర్డర్లకు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటాయి. అలాంటిది ఐపీఎల్ తాజా సీజన్ అలా ప్రారంభమైందో లేదో.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బాయ్‌కాట్ చేయాలంటూ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. దీనికి వెనుక పెద్ద కారణం ఉంది. వివరాల్లోకెళితే.. ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఉద్దేశించి స్విగ్గీ సరదాగా చేసిన ట్వీట్ మిస్ ఫైర్ అయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. తమ అభిమాన క్రికెటర్‌ను కించపరిచేలా స్విగ్గీ చేసిన ట్వీట్ ఉందని రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్విగ్గీని నిషేదించాలని డిమాండ్ చేయడంతో పాటు.. బాయ్ కట్ చేద్దామని పిలుపునిస్తున్నారు. దాంతో #BoycottSwiggy ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇక రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ను ఉద్దేశించి ట్రోల్ చేసేవారంతా అతన్ని వడాపావ్ అని పిలుస్తుంటారు. గతంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా రోహిత్‌ ఫిట్‌నెస్‌‌ను ప్రశ్నిస్తూ వడపావ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

    మహారాష్ట్రలో ఫేయస్ డిష్ అయిన వడాపావ్‌ను రోహిత్ ఎక్కువగా తింటాడని అందుకే అలా బొద్దుగా ఉంటాడని గతంలో అతనిపై అనేక ట్రోల్స్ వచ్చాయి. ఇది తెలియని స్విగ్గీ పప్పులో కాలేసింది. వడాపావ్ స్టాల్‌ దగ్గరకు రోహిత్ వెళ్లినట్లు ఓ యూజర్ ఎడిట్ చేసిన ఫొటోను ట్వీట్ చేశాడు. దానికి "హేటర్స్.. ఇది ఖచ్చితంగా ఫోటోషాపే అంటారు" అనే క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. అయితే ఇది సరదా ట్వీట్ అని భావించిన స్విగ్గీ.. ఆ ట్వీట్‌ను షేర్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురైంది. అభిమానులను నుంచి ఆగ్రహం వ్యక్తమవ్వడంతో అప్రమత్తమైన స్విగ్గీ.. వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అభిమానులు.. స్విగ్గీని బహిష్కరించాలని పిలుపు నిస్తున్నారు. కొంతమంది అయితే స్విగ్గీ యాప్‌లను డిలీట్ చేశామనే స్క్రీన్ షాట్స్‌ను కూడా ట్విటర్ వేదికగా పంచుకుంటూ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు.రోహిత్‌ను అవమానించడానికి స్విగ్గీకి ఎంత ధైర్యమని మరొకరు ప్రశ్నించారు.












    రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం నేపథ్యంలో స్విగ్గీ స్పందించింది. తాము ఏ మాత్రం రోహిత్ శర్మను కించపర్చాలని ఆ ట్వీట్‌ను షేర్ చేయలేదని, పాజిటివ్ కోణంలోనే పంచుకున్నామని స్పష్టం చేసింది. ఆ ఫొటో తాము చేసింది కాదని, ఓ అభిమాని చేసిన ట్వీట్‌ సరదాగా ఉందని, అభిమానులను ఆకట్టుకుందనే ఉద్దేశంతోనే షేర్ చేశామని, ఎవరిని కించపరచాలని మాత్రం కాదని పేర్కొంది. మేము ఎప్పుడూ పల్టాన్‌‌‌ను అభిమానిస్తామని రోహిత్ అభిమానులకు ప్రత్యేకంగా విన్నవించింది. మొత్తానికి పప్పులో కాలేసి.. చివరికి తంటాలు పడుతోంది స్విగ్గీ. మరోవైపు.. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై బోణీ కొట్టింది. పది పరుగుల తేడాతో గెలిచి.. కోల్ కతా పై తమకున్న రికార్డును కంటిన్యూ చేసింది.
    Published by:Sridhar Reddy
    First published: