Home /News /sports /

MUMBAI INDIANS SECURE THEIR FIRST WIN OF SEASON PVN

IPL 2022 | RR vs MI : ఊపిరి పీల్చుకున్న ముంబై..రాజస్తాన్ పై విజయం

రాజస్తాన్ పై ముంబై విజయం

రాజస్తాన్ పై ముంబై విజయం

Mumbai Indians Win : ఐపీఎల్​ 15వ సీజన్ ​లో ఎట్టకేలకు ముంబై జట్టు తొలి విజయం నమోదు చేసింది. తొమ్మిదో మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల ఖాతాను ఓపెన్‌ చేసింది.

RR vs MI : ఐపీఎల్​ 15వ సీజన్ ​లో ఎట్టకేలకు ముంబై జట్టు తొలి విజయం నమోదు చేసింది. తొమ్మిదో మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల ఖాతాను ఓపెన్‌ చేసింది. శనివారం రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచిం ఫీల్గింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్ రాయల్స్ ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ముంబై ముందు 159 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

లక్ష్య ఛేదనలో ముంబై జట్టు.. ఐదు వికెట్లను కోల్పోయి 19.2 ఓవర్లలో 159 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్‌ యాదవ్ (51) అర్ధ శతకంతో రాణించగా.. తిలక్ వర్మ (35), ఇషాన్ కిషన్‌ (26), టిమ్‌ డేవిడ్‌ (20 న) ఫర్వాలేదనిపించారు. రోహిత్ శర్మ 2, పొలార్డ్‌ 10, డానియల్ సామ్స్ 6 పరుగులు చేశారు. ఇవాళ ముంబై కెప్టెన్ సారథి రోహిత్ శర్మ పుట్టిన రోజు. ఈ విజయాన్ని బర్త్‌డే బాయ్‌కు ముంబై ఆటగాళ్లు గిఫ్ట్‌గా ఇచ్చారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: IPL 2022, Mumbai Indians

తదుపరి వార్తలు