హోమ్ /వార్తలు /క్రీడలు /

Mumbai Indians : ముంబై ఇండియన్స్ కొత్త హెడ్ కోచ్ గా సౌతాఫ్రికా లెజెండ్.. ఎవరంటే?

Mumbai Indians : ముంబై ఇండియన్స్ కొత్త హెడ్ కోచ్ గా సౌతాఫ్రికా లెజెండ్.. ఎవరంటే?

ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్

Mumbai Indians : ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కొత్త కోచ్ గా సౌతాఫ్రికా (South Africa) మాజీ దిగ్గజ ప్లేయర్ మార్క్ బౌచర్ (Mark Boucher)ను నియమించింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Mumbai Indians : ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కొత్త కోచ్ గా సౌతాఫ్రికా (South Africa) మాజీ దిగ్గజ ప్లేయర్ మార్క్ బౌచర్ (Mark Boucher)ను నియమించింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేసింది. మార్క్ బౌచర్ ను ముంబై ఇండియన్స్ కుటుంబంలోకి ఆహ్వానించడం ఆనందంగా ఉందంటూ జియో (Jio) ఇన్ఫోకామ్ లిమిటెడ్  చైర్మన్ ఆకాశ్ అంబానీ (Akash Ambani)పేర్కొన్నారు.  ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా ఎంపికవ్వడం గౌరవంగా భావిస్తున్నాని బౌచర్ పేర్కొన్నారు. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుకు కోచ్ గా వ్యవహరించడాన్ని తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు కూడా బౌచర్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ విజయాల్లో తన వంతు పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. జట్టుతో కలిసి పని చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కూడా బౌచర్ పేర్కొన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన టీంగా ఉంది. ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్ చాంపియన్ గా నిలిచింది. ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా 20 లీగ్ లో, ఇంటర్నేషనల్ లీగ్ టి20 టోర్నీల్లోనూ ఫ్రాంచైజీలను సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ (సౌతాఫ్రికా టి20 లీగ్), ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ (ILT20) ఫ్రాంచైజీలను సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ ఫ్రాంచైజీకి ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ సైమన్ కటిచ్ హెడ్ కోచ్ గా.. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హసీం ఆమ్లా బ్యాటింగ్ కోచ గా వ్యవహరించనున్నారు.

ముంబై ఇండియన్స్  #OneFamily  స్లోగన్ తో  ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ కేప్ టౌన్ జట్లను కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక 2017 నుంచి ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ గా ఉన్న మహేలా జయవర్దనెను గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫామెన్స్‌గా .. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ గా ఉన్న జహీర్ ఖాన్ ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డవలప్ మెంట్ గా నియమించింది. మహేలా జయవర్దనే పర్యవేక్షణలోని ముంబై ఇండియన్స్ 2017, 2019, 2020 ఐపీఎల్ సీజన్లలో చాంపియన్ గా నిలిచింది. ఒక మార్క్ బౌచర్ గతంలో ఐపీఎల్ జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. అంతర్జాతీయ మ్యాచ్ ఆడే సమయంలో బౌచర్ కంటికి గాయమైంది. బంతి వికెట్లకు తగలడంతో గాల్లోకి లేచిన బెయిల్స్ బౌచర్ కంటిలో గుచ్చుకున్నాయి. దాంతో అతడు క్రికెట్ కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. బౌచర్ తన కెరీర్ లో 147 టెస్టులు, 295 వన్డేలు ఆడాడు. ప్రస్తుతం అతడు సౌతాఫ్రికా జట్టు కోచ్ గా ఉన్నాడు. ఈ టి20 ప్రపంచకప్ అనంతరం అతడు ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.

‘ముంబై ఇండియన్స్ కోచ్ గా మార్క్ బౌచర్ ను ఆహ్వానిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పటికే ప్లేయర్ గా.. కోచ్ గా బౌచర్ కు అపారమైన అనుభవం ఉంది. ఈ అనుభవం ముంబై ఇండియన్స్ ను నడిపించేందుకు.. విజయాలను అందించేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. బౌచర్ కోచింగ్ లో ముంబై ఇండియన్స్ మరిన్ని విజయాలను సాధించాలని నమ్మకంగా ఉన్నా‘ అని జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్  చైర్మన్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Jasprit Bumrah, Kieron pollard, Mumbai Indians, Rohit sharma, Sachin Tendulkar

ఉత్తమ కథలు