Home /News /sports /

MUMBAI INDIANS POST VIDEO OF TIM DAVID WHO HITS MASSIVE SIXERS IN T20 BLAST CRICKET LEAGUE IN ENGLAND SJN

Mumbai Indians : భీభత్సం అంటే ఇలానే ఉంటుందేమో.! టి20 బ్లాస్ట్ లో చెలరేగిపోయిన ముంబై ఇండియన్స్ పవర్ హిట్టర్

Tim David (IPL Twitter)

Tim David (IPL Twitter)

Mumbai Indians : ఇంగ్లండ్ (England) వేదికగా జరుగుతోన్న వైటాలిటీ టి20 బ్లాస్ట్ టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ (Tim David) భీభత్సం సృష్టించాడు.

Mumbai Indians : ఇంగ్లండ్ (England) వేదికగా జరుగుతోన్న వైటాలిటీ టి20 బ్లాస్ట్ టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ (Tim David) భీభత్సం సృష్టించాడు. నిన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో మెరుపులు మెరిపించిన ఈ సింగపూర్ ప్లేయర్.. ఇప్పుడు ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న టి20 బ్లాస్ట్ లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. అక్కడ లంకషైర్ తరఫున ఆడుతున్న టిమ్ డేవిడ్.. వోర్సెస్టర్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో దంచి కొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే 60 పరుగులు చేసి ఆ జట్టు తరఫున రెండో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. టిమ్ డేవిడ్ విధ్వంసంతో వోర్సెస్టర్ షైర్ పై 12 పరుగుల తేడాతో లంక షైర్ విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన లంకషైర్ 20 ఓవర్లల్లో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. కీలక ప్లేయర్లు విఫలం అవ్వడంతో లంక షైర్ ఒక దశలో 98 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించాడు. 4 ఫోర్లతో పాటు 4 భారీ సిక్సర్లు బాదిన అతడు లంకషైర్ స్కోరు బోర్డును రాకెట్ వేగంతో పరుగు పెట్టించాడు. అతడి ధాటికి 140 కూడా కష్టం అనుకున్న చోట.. లంకషైర్ ఏకంగా 183 పరుగులు చేసింది. చివరి ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించి టిమ్ డేవిడ్ అవుటయ్యాడు. ఈ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ విధ్వంసానికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.



184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వోర్సెస్టర్ షైర్ కూడా అద్భుతంగా ఆడింది. కివీస్ బ్యాటర్ కాలిన్ మన్రో (53), బ్రెట్ (37), జేక్ లిబీ (33) రాణించడంతో వోర్సెస్టర్ షైర్ టార్గెట్ వైపు కదిలింది. అయితే రిచర్డ్ గ్లీసన్ 5 వికెట్లతో 5 వికెట్లతో వోర్సెస్టర్ షైర్ నడ్డి విరిచాడు. దాంతో వోర్సెస్టర్ షైర్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఫిబ్రవరి నెలలో జరిగిన వేలంలో టిమ్ డేవిడ్ ను రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఐపీఎల్ ఆరంభంలో టిమ్ డేవిడ్ పెద్దగా రాణించలేదు. దాంతో రెండు మ్యాచ్ ల తర్వాత టిమ్ డేవిడ్ పై వేటు వేసిన ముంబై సగం సీజన్ వరకు అతడిని బెంచ్ కే పరిమితం చేసింది. అయితే చివర్లో మళ్లీ అవకాశం ఇవ్వగా పవర్ హిట్టింగ్ తో రెచ్చిపోయాడు. దాంతో వచ్చే సీజన్ లో ముంబై జట్టులో టిమ్ డేవిడ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని టీం ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: England, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Kieron pollard, Mumbai Indians, Rohit sharma, Sanju Samson

తదుపరి వార్తలు