హోమ్ /వార్తలు /క్రీడలు /

Mumbai Indians: MI ఫ్యామిలీలోకి మరో టీమ్‌.. USA మేజర్ లీగ్ క్రికెట్‌లో ‘MI న్యూయార్క్‌’ అరంగేట్రం

Mumbai Indians: MI ఫ్యామిలీలోకి మరో టీమ్‌.. USA మేజర్ లీగ్ క్రికెట్‌లో ‘MI న్యూయార్క్‌’ అరంగేట్రం

Mumbai Indians: MI ఫ్యామిలీలోకి మరో టీమ్‌..

Mumbai Indians: MI ఫ్యామిలీలోకి మరో టీమ్‌..

Mumbai Indians: ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీ మరింత పెరిగింది. ఐదో క్రికెట్ ఫ్రాంచైజీగా న్యూయార్క్‌ బేస్డ్‌ టీమ్‌ MI న్యూయార్క్‌ చేరినట్లు రిలయన్స్‌ ప్రకటించింది. టీమ్ మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ ఎడిషన్‌లో MI న్యూయార్క్‌ అడుగుపెట్టబోతోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)కి అభిమానులు ఉన్నారు. అన్ని దేశాలకు చెందిన ప్లేయర్స్‌ ఈ లీగ్‌లో చోటు కోసం ప్రయత్నిస్తుంటారు. అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌ట్రైన్‌మెంట్‌, నరాలు తెగే ఉత్కంఠకు వేదికైన ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్‌ టీమ్‌గా ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) నిలిచింది. అత్యధికంగా ఐదు సార్లు ఐపీఎల్‌ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీని నిర్వహిస్తోంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీ మరింత పెరిగింది. ఐదో క్రికెట్ ఫ్రాంచైజీగా న్యూయార్క్‌ బేస్డ్‌ టీమ్‌ MI న్యూయార్క్‌ చేరినట్లు రిలయన్స్‌ ప్రకటించింది. టీమ్ మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ ఎడిషన్‌లో MI న్యూయార్క్‌ అడుగుపెట్టబోతోంది.

* గ్లోబల్‌ బ్రాండ్‌ ముంబై ఇండియన్స్‌

ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీకి న్యూయార్క్‌ ఫ్రాంచైజీని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని నీతా అంబానీ అన్నారు. యూఎస్‌లో మొదటి క్రికెట్ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నామని, ఫియర్‌లెస్‌, ఎంటర్‌టైనింగ్‌ క్రికెట్‌కి గ్లోబల్‌ బ్రాండ్‌గా ముంబై ఇండియన్స్‌ను నిలుపుతామని చెప్పారు. ఇది MIకి మరో కొత్త ప్రారంభమని, టీమ్ జర్నీ కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.

* ఐదో ఫ్రాంచైజీ ఎంఐ న్యూయార్క్‌

ఎంఐ #వన్‌ఫ్యామిలీ(MI #OneFamily) ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను ఎక్స్‌ప్యాండ్‌ చేయడానికి, ప్రమోట్‌ చేయడానికి కృషి చేస్తోంది. ఇప్పటికీ దీని కింద ముంబై ఇండియన్స్ (IPL), MI కేప్ టౌన్ (SA20), MI ఎమిరేట్స్ (ILT20), ముంబై ఇండియన్స్ (WPL) జట్లు ఉన్నాయి. మూడు వేర్వేరు ఖండాలు, నాలుగు వేర్వేరు దేశాలు, ఐదు వేర్వేరు లీగ్‌లలో ముంబై ఇండియన్స్‌ ప్రాతినిథ్యం వహిస్తోంది. కొత్తగా ఐదో ఫ్రాంచైజీగా MI న్యూయార్క్ చేరింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 మిలియన్ల డిజిటల్ ఫ్యాన్స్‌ అత్యధికంగా ఫాలో అవుతున్న గ్లోబల్ క్రికెట్ బ్రాండ్‌లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్‌లలో ఏడాది పొడవునా 6 నెలలపాటు ఎంఐ ఫ్యామిలీ టీమ్‌లు క్రికెట్‌ ఆడుతున్నాయి. 2009 నుంచి ముంబై ఇండియన్స్ 99% బ్రాండ్ విలువలో (బ్రాండ్ ఫైనాన్స్) వృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండ్‌లు ముంబై ఇండియన్స్‌ ద్వారా తమ ప్రచారాలు నిర్వహించేందుకు ఇష్టపడుతున్నాయి.

మేజర్ లీగ్ క్రికెట్ యునైటెడ్ స్టేట్స్‌లో మొదటి ప్రొఫెషనల్ ట్వంటీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్ అవుతుంది. మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభ సీజన్ 2023 వేసవిలో ప్రారంభమవుతుంది. www.majorleaguecricket.comలో మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

* ముంబై ఇండియన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని నడుపుతోంది. #OneFamily విస్తరణతో, MI ఇప్పుడు నాలుగు దేశాలలో ఐదు T20 జట్లను సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ లీగ్ T20లో MI ఎమిరేట్స్, SA20లో MI కేప్ టౌన్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, USA మేజర్ లీగ్‌ క్రికెట్‌ 2023లో MI న్యూయార్క్ అరంగేట్రం చేయబోతోంది.

గత 16 సంవత్సరాలుగా, ముంబై ఇండియన్స్ ఏడు టైటిళ్లతో అత్యంత స్థిరమైన క్రికెట్ ఫ్రాంచైజీగా అవతరించింది. ఇందులో IPLలో రికార్డు స్థాయిలో 5 ట్రోఫీలు, రెండు ఛాంపియన్స్ లీగ్ T20 టైటిల్స్ ఉన్నాయి. బ్రాండ్ ఫైనాన్స్, గ్లోబల్ బ్రాండ్ వాల్యుయేషన్ ఏజెన్సీ ఇటీవలే ముంబై ఇండియన్స్‌కు AA బ్రాండ్ స్ట్రెన్త్ రేటింగ్‌ ఇచ్చింది. 2009 నుంచి 99% వృద్ధితో ముంబై ఇండియన్స్‌కి రెట్టింపు బ్రాండ్ విలువను అందించింది.

First published:

Tags: Cricket, IPL 2023, Mumbai Indians

ఉత్తమ కథలు