హోమ్ /వార్తలు /క్రీడలు /

Mumbai Indians: మహేలా జయవర్దనె, జహీర్ ఖాన్‌కు కొత్త బాధ్యతలు

Mumbai Indians: మహేలా జయవర్దనె, జహీర్ ఖాన్‌కు కొత్త బాధ్యతలు

Mumbai Indians: మహేలా జయవర్దనె, జహీర్ ఖాన్‌కు కొత్త బాధ్యతలు

Mumbai Indians: మహేలా జయవర్దనె, జహీర్ ఖాన్‌కు కొత్త బాధ్యతలు

Mumbai Indians | ముంబై ఇండియన్స్ ఇటీవల #OneFamily ముంబై ఇండియన్స్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా విస్తరణ ప్రారంభించింది. మూడు దేశాల్లో మూడు టీ20 టీమ్స్ #OneFamily ముంబై ఇండియన్స్ పరిధిలోకి రానున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) యాజమాన్యం మహేలా జయవర్దనె, జహీర్ ఖాన్‌కు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఎంఐ కోసం ప్రపంచ క్రికెట్ వారసత్వాన్ని నిర్మించే లక్ష్యంతో వారికి కొత్త పాత్రల్ని అప్పగించింది. ఎంఐ #OneFamily విస్తరణతో ముంబై ఇండియన్స్‌తో  ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ కేప్ టౌన్ కూడా చేరబోతున్నాయి. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ సెంట్రల్ టీమ్ అవసరాన్ని గుర్తించింది. జహీర్ ఖాన్‌ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా, మహేలా జయవర్దనెను గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫామెన్స్‌గా నియమించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టపడే క్రికెట్ బ్రాండ్‌లలో ఎంఐను ఒకటిగా మార్చిన నీతి, విలువలు, అభ్యాసంపై ఒకే కుటుంబంలోని టీమ్స్‌గా స్థిరత్వానికి దోహదపడుతుంది. ఇందుకోసం ఇద్దరు MI అనుభవజ్ఞులైన మహేల జయవర్ధనె, జహీర్ ఖాన్‌లను ఎంపిక చేసింది. ఎంఐ విలువలపై వీరికి ఉన్న లోతైన అవగాహన, నిరూపించబడిన ట్రాక్ రికార్డ్‌తో కొత్త పాత్రలకు ఎంపికయ్యారు.

మహేలా జయవర్దనె, జహీర్ ఖాన్‌ మా గ్లోబల్ కోర్ టీమ్‌లో భాగంగా ఉండటం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇద్దరూ MI కుటుంబంలో అంతర్భాగంగా ఉన్నారు. MI క్రికెట్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తారు. వారు ప్రపంచవ్యాప్తంగా మా అన్ని జట్లకు ఒకే విధమైన శిక్షణ అందించగలరని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ పర్యావరణ వ్యవస్థలలో మార్పును తీసుకురాగలరని నేను విశ్వసిస్తున్నాను.

ఆకాశ్ ఎం అంబానీ, ఛైర్మన్, రిలయన్స్ జియో ఇన్పోకామ్ లిమిటెడ్

ఎంఐ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫామెన్స్‌గా నియమించబడ్డ మహేలా జయవర్దనె, ప్రపంచవ్యాప్తంగా గ్రూప్ క్రికెట్ కార్యకలాపాలకు సీనియర్ నాయకత్వాన్ని అందించడం,మొత్తం వ్యూహాత్మక ప్రణాళికతో సహా, సమీకృత గ్లోబల్ హై-పెర్ఫార్మెన్స్ ఎకో-సిస్టమ్ సృష్టించడం, అలాగే ప్రతి జట్టు కోచింగ్, సపోర్ట్ స్ట్రక్చర్‌ల బాధ్యత చూసుకోవడం, క్రికెట్ యొక్క స్థిరమైన బ్రాండ్, ఎంఐ ద్వారా నిర్దేశించబడిన ఉత్తమ అభ్యాసాలను అమలు చేయడం కోసం ఆయా జట్ల ప్రధాన కోచ్‌లతో కలిసి పని చేస్తారు.

MI గ్లోబల్ క్రికెట్ కార్యకలాపాలకు నాయకత్వం వహించడం నాకు గర్వంగా ఉంది. అంబానీ, ఆకాశ్ నాయకత్వం, మార్గదర్శకత్వం ఎంఐని అత్యంత విలువైన గ్లోబల్ క్రికెట్ ఫ్రాంచైజీగా మార్చింది. ఎంఐ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. క్రికెట్ యొక్క బలమైన సమ్మిళిత ప్రపంచ బ్రాండ్‌ను నిర్మించడానికి నేను ఈ కొత్త బాధ్యత చేపట్టడానికి ఎదురు చూస్తున్నాను.

మహేలా జయవర్దనె, గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫామెన్స్‌, ఎంఐ

Big Billion Offer: ఈ పాపులర్ మొబైల్‌పై రూ.6,000 డిస్కౌంట్... బిగ్ బిలియన్ ఆఫర్

Mahela Jayawardene, MI global network, Mumbai Indians, Mumbai Indians global network, Mumbai Indians One Family global network, Zaheer Khan, ఎంఐ గ్లోబల్ నెట్వర్క్, జహీర్ ఖాన్, మహేలా జయవర్దనె, ముంబై ఇండియన్స్, ముంబై ఇండియన్స్ గ్లోబల్ నెట్వర్క్

ఇక ఎంఐ గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా నియమించబడ్డ జహీర్ ఖాన్, క్రీడాకారుల అభివృద్ధికి బాధ్యత వహించడం, ప్రతిభను గుర్తించడం, ఎంఐ ఫిలాసఫీ, విజయాలకు ప్రధానంగా నిలిచిన ఎంఐ బలమైన ప్రోగ్రామ్‌ను రూపొందించడం, భౌగోళిక ప్రాంతాలలో వాటిని అమలు చేయడం, ప్రతీ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంఐ టీమ్స్‌కు సాయం చేయడంలో కీలకంగా ఉంటారు.

ఈ కొత్త పాత్రను స్వీకరించడానికి నేను వినయపూర్వకంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచినందుకు నీతా అంబానీ, ఆకాశ్‌లకు ధన్యవాదాలు. ఒక ఆటగాడిగా, కోచింగ్ టీమ్ మెంబర్‌గా నాకు ఎంఐ నిలయంగా ఉంది. ఇప్పుడు మేము కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, కుటుంబంలో చేరగల కొత్త సామర్థ్యాన్ని వెలికితీసేందుకు గ్లోబల్ నెట్‌వర్క్‌లోని అందరితో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను.

జహీర్ ఖాన్, గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్, ఎంఐ

SBI Scheme: ఎస్‌బీఐ కొత్త స్కీమ్... వచ్చే నెల వరకే అవకాశం

Mahela Jayawardene, MI global network, Mumbai Indians, Mumbai Indians global network, Mumbai Indians One Family global network, Zaheer Khan, ఎంఐ గ్లోబల్ నెట్వర్క్, జహీర్ ఖాన్, మహేలా జయవర్దనె, ముంబై ఇండియన్స్, ముంబై ఇండియన్స్ గ్లోబల్ నెట్వర్క్

ముంబై ఇండియన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజ్‌ను ఆర్ఐఎల్ నిర్వహిస్తోంది. ఇటీవల #OneFamily ముంబై ఇండియన్స్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా విస్తరణ ప్రారంభించింది. మూడు దేశాల్లో మూడు టీ20 టీమ్స్ #OneFamily ముంబై ఇండియన్స్ పరిధిలోకి రానున్నాయి. ఎంఐ ఎమిరేట్స్ ఆఫ్ యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ టీ20, ఎంఐ కేప్ టౌన్ ఆఫ్ సౌత్‌ఆఫ్రికా టీ20 లీగ్ ఎంఐ ఫ్యామిలీలో 2023లో చేరనున్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Akash Ambani, Mahela Jayawardene, Mumbai Indians, Nita Ambani, Reliance Industries, Zaheer Khan

ఉత్తమ కథలు