MI vs PBKS: అదరగొట్టిన ముంబై బౌలర్లు.. చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే

పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేసిన ముంబై బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే!

MI vs PBKS: పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు సఫలమయ్యారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి విజయావకాశాలను మెరుగుపరుచుకుంది.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) రెండో దశలో వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టతరం చేసుకున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కీలక పోరులో పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) తలపడుతున్నది. తప్పక గెలవాల్సి మ్యాచ్‌లో ముంబై బౌలర్లు అదరగొట్టారు. మొదటి నుంచే వికెట్లు తీస్తూ పంజాబ్ బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తడి పెంచారు. క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పాటు పరుగుల రాకుండా కట్టడి చేయడంతో పంజాబ్ కింగ్స్ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. ఓపెనర్ కేఎల్ రాహల్ (21) (KL Rahul), మిడిల్ ఆర్డర్‌లో మార్క్‌రమ్ (42), దీపక్ హుడా (28) పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఓపెనర్లు తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో మన్‌దీప్ సింగ్ (15), క్రిస్ గేల్ (1), కేఎల్ రాహుల్ (21), నికొలస్ పూరన్ (2) అవుటవడంతో పంజాబ్ కష్టాల్లో పడింది.

    ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏడెన్ మార్క్‌రమ్ (42) ధాటిగా ఆడాడు. కేవలం 29 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అతడు ఇంకా కొంత సేపు ఆడి ఉంటే పంజాబ్ మరిన్ని పరుగులు రాబట్టేదే. కానీ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో మార్క్‌రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడుజ ఆ తర్వాత దీపక్ హుడా (28), హర్‌ప్రీత్ బ్రార్ (14) పర్వాలేదని పించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.







    ముంబై బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, కిరాన్ పొలార్డ్ చెరి 2 వికెట్లు, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్ తలా ఒక వికెట్ తీశారు. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్ గెలవడానికి 136 పరుగులు చేయాల్సి ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published: