హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India : టీమిండియా ఎంట్రీపై కన్నేసిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ.. సెంచరీ కొట్టి మరీ సిగ్నల్స్ పంపాడుగా..

Team India : టీమిండియా ఎంట్రీపై కన్నేసిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ.. సెంచరీ కొట్టి మరీ సిగ్నల్స్ పంపాడుగా..

PC : TWITTER

PC : TWITTER

Team India : తిలక్ వర్మ (Tilak Verma).. ఈ ఏడాది వరకు కూడా ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. అండర్ 19 ప్రపంచకప్ (U19 World Cup)లో భారత్ (India)కు ప్రాతినిధ్యం వహించినా పెద్దగా గుర్తింపు రాలేదు. రంజీల్లో దంచి కొట్టినా పట్టించుకోలేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Team India : తిలక్ వర్మ (Tilak Verma).. ఈ ఏడాది వరకు కూడా ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. అండర్ 19 ప్రపంచకప్ (U19 World Cup)లో భారత్ (India)కు ప్రాతినిధ్యం వహించినా పెద్దగా గుర్తింపు రాలేదు. రంజీల్లో దంచి కొట్టినా పట్టించుకోలేదు. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ (IPL) మెగా వేలంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఈ యువ ప్లేయర్ ను కొనుగోలు చేయడంతో.. ఒక్కసారిగా అందరి కళ్లు తిలక్ వర్మపై పడ్డాయి. ఇక ఈ సీజన్ లో ముంబై ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ తిలక్ వర్మ ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కించుకున్నాడు. అంచనాలకు మించి రాణించి ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తోనే ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అంటూ కితాబు అందుకున్నాడు.

ఈ ఏడాది ఐపీఎల్ లో రాణించిన తిలక్ వర్మ.. వచ్చే ఏడాది మరింత ధాటిగా ఆడి టీమిండియాలో స్థానం దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.  అయితే తిలక్ వర్మకు ఊహించని విధంగా లక్ కలిసి వచ్చింది. న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే అనధికారిక టెస్టు మ్యాచ్ కోసం ప్రకటించిన జట్టులో తిలక్ వర్మ చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు తొలి ఇన్నింగ్స్ లో శతకంతో చెలరేగాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన తిలక్ వర్మ 183 బంతుల్లో 121 పరగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ సెంచరీతో టీమిండియా సీనియర్ జట్టుకు ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తిలక్ వర్మ హింట్ కూాడా ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో అభిమన్యు ఈశ్వరన్ (132), రజత్ పటిదార్ (176)లు కూడా సెంచరీలు సాధించారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 6 వికెట్లకు 571 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అంతకుముందు న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో400 పరుగులకు ఆలౌటైంది. ముఖేశ్ కుమార్ 5 వికెట్లు తీశాడు. సర్ఫరాజ్ ఖాన్ 2 వికెట్లతో రాణించాడు. ఫలితంగా భారత్ కు 171 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన న్యూజిలాండ్  22 ఓవర్లలో వికెట్ నష్టపోయి 59 పరగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రచిన్ రవీంద్ర (24 బ్యాటింగ్), జో కార్టర్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆటకు నేడే చివరి రోజు. న్యూజిలాండ్ మరో 112 పరుగులు వెనకబడి ఉంది. ఇది అనధికారిక టెస్టు కావడంతో నాలుగు రోజుల పాటే జరగనుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hardik Pandya, IND vs PAK, India VS Pakistan, IPL, IPL 2022, KL Rahul, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma, Sachin Tendulkar, Team India

ఉత్తమ కథలు