అభిమానికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ సర్‌ప్రైజ్ గిఫ్ట్...

సెక్యూరిటీని దాటుకొని ధోనీ దగ్గరికెళ్లి కొత్త బైక్ విషయం చెప్పి ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడు. అయితే బైక్‌లను పిచ్చిగా అభిమానించే ధోనీ..తన అభిమాని చేసిన పనికి ఆశ్చర్యపోయాడు.

news18-telugu
Updated: November 2, 2019, 10:58 PM IST
అభిమానికి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ సర్‌ప్రైజ్ గిఫ్ట్...
ధోనీ
  • Share this:
జార్ఖండ్‌కు చెందిన ఓ అభిమానికి తాను కొన్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై నేరుగా రాంచీలోని స్టేడియానికి చేరుకున్నాడు. అదే సమయంలో ధోనీ ప్రాక్టీస్ ముగించుకుని బయటకు వస్తున్నాడు. అక్కడే ధోనీని చూసిన అభిమాని ఉద్వేగానికి గురయ్యాడు. అంతే వెంటనే సెక్యూరిటీని దాటుకొని ధోనీ దగ్గరికెళ్లి కొత్త బైక్ విషయం చెప్పి ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడు. అయితే బైక్‌లను పిచ్చిగా అభిమానించే ధోనీ..తన అభిమాని చేసిన పనికి ఆశ్చర్యపోయాడు. అంతేకాదు అతడు తెచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను చూసి ముచ్చటపడ్డాడు. అభిమానికి అనుకోని సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఫ్యాన్ ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ట్యాంక్‌పై ఆటోగ్రాఫ్ చేశాడు. ఈ ఘటనతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
First published: November 2, 2019, 10:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading