ధోనీకి ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్

భారత ఆర్మీలో ట్రైనింగ్ పొందేందుకు అతడు పెట్టుకున్న దరఖాస్తును ఆమోదించింది. ఎలాంటి యాక్టివ్ ఆపరేషన్స్‌లో ధోనీకి అవకాశం ఇవ్వకూడదని ఆర్మీ నిర్ణయించినట్టు సమాచారం.

news18-telugu
Updated: July 21, 2019, 8:40 PM IST
ధోనీకి ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్
ఎంఎస్ ధోనీ (ఫైల్ చిత్రం)
  • Share this:
మహేంద్ర సింగ్ ధోనీకి భారత ఆర్మీ ఓ గుడ్ న్యూస్ అందించింది. భారత ఆర్మీలో ట్రైనింగ్ పొందేందుకు అతడు పెట్టుకున్న దరఖాస్తును ఆమోదించింది. దీనికి సంబంధించి ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టె తెలిసింది. పారాషూట్ రెజిమెంట్ బెటాలియన్‌తో కలసి మహేంద్ర సింగ్ ధోనీ ట్రైనింగ్ పొందనున్నట్టు తెలిసింది. దీంతో పాటు జమ్మూకాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా మహేంద్ర సింగ్ ధోనీకి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, అదే సమయంలో ఎలాంటి యాక్టివ్ ఆపరేషన్స్‌లో ధోనీకి అవకాశం ఇవ్వకూడదని ఆర్మీ నిర్ణయించినట్టు సమాచారం. ఆర్మీలో ట్రైనింగ్ కోసం ధోనీ వెస్టిండీస్ టూర్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో రిషబ్ పంత్‌కు చోటు దక్కింది. మరోవైపు ధోనీ రిటైర్మెంట్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, అది ధోనీకి నచ్చినప్పుడే తీసుకుంటాడంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. దీంతో ఇప్పట్లో ధోనీ రిటైర్మెంట్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు ధోనీ రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి వస్తాడని, బీజేపీలో చేరతాడంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ధోనీ కానీ, అతడి తరఫన కానీ ఎవరూ స్పందించలేదు.

Published by: Ashok Kumar Bonepalli
First published: July 21, 2019, 8:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading