ముద్దు గుమ్మ జీవా.. ధోనీ ఫోటోను చూసి ఏమాందో చూడండి!!

భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, ఎంఎస్ ధోనితో పాటు అతడి కుమార్తె జివాకు కూడా వేలల్లో అభిమానులు ఉన్నారు. ధోని భార్య సాక్షి తరచుగా జివా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.


Updated: September 10, 2020, 5:48 PM IST
ముద్దు గుమ్మ జీవా.. ధోనీ ఫోటోను చూసి ఏమాందో చూడండి!!
zeeva
  • Share this:
భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, ఎంఎస్ ధోనితో పాటు అతడి కుమార్తె జివాకు కూడా వేలల్లో అభిమానులు ఉన్నారు. ధోని భార్య సాక్షి తరచుగా జివా ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. జివాకు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక అకౌంట్లు ఉండటం విశేషం. కానీ వాటిని ధోనీ, సాక్షిలే నిర్వహిస్తుంటారు. ఇటీవల జివా ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దాంట్లో తండ్రి ఫొటోను పట్టుకొని జివా సందడి చేసింది. వీడియోలో సాక్షి కూతుర్ని.. అతడు ఎవరు? అని అడిగింది.
View this post on Instagram

Papa s biggest fan !


A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on


“ఇది నాన్న” అని జివా సమాధానం ఇచ్చిన జివాను సాక్షి మరోసారి ప్రశ్నిస్తూ.. సరిగ్గా చూసి చెప్పు అని అడిగింది. స్పందించిన జివా.. "మహేంద్ర సింగ్ ధోని" అని చెప్పింది. మరోసారి కూతుర్ని.. ధోనీయేనా? అని సాక్షి అడగ్గా... అవును, నాకు తెలుసు అని జివా ముద్దుముద్దుగా చెప్పింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఇన్స్టాగ్రామ్ పేజీ బయోలో.. ఈ పేజీని అమ్మ సాక్షి సింగ్, నాన్న ధోనీ నిర్వహిస్తున్నారు అని ఉంది. ఈ వీడియోకు “నాన్నకు అతిపెద్ద అభిమాని!” అనే ట్యాగ్ ఉండటం విశేషం.
View this post on Instagram

Encounter with a Chameleon on a special day ! Happy Lizard day ! 🦎🦎


A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on
గతంలో ఇదే ఇన్స్టాగ్రామ్ పేజీలో జివాకు సంబంధించిన రెండు వీడియోలను పోస్ట్ చేశారు. వాటిలో ఆకుపచ్చ రంగులో ఉన్న కమెలియన్(ఒక రకం తొండ)తో మాట్లాడుతూ సందడి చేసింది. దానికి “ఎన్కౌంటర్ విత్ కమెలియన్.. బల్లుల దినోత్సవ శుభాకాంక్షలు” అనే ట్యాగ్ను జతచేశారు. జూన్ నెలలో ధోని తన ఫామ్హౌస్ లో కూతురితో కలిసి బైక్రైడ్ చేస్తున్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ పోస్ట్ చేసింది. అప్పట్లో ఆ వీడియో ట్రెండింగ్లో నిలిచింది. ధోనీ, సాక్షితో పాటు సీఎస్కే కూడా జివా వీడియోలను తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పంచుకుంటుంది.
View this post on Instagram

When 'crazy lightning' and 'happiness' are rolled into one! 😍 #VaaMaaMinnal #ThalaDharisanam VC: @sakshisingh_r


A post shared by Chennai Super Kings (@chennaiipl) on


ప్రస్తుతం ధోనీ ఐపీఎల్ ఆడేందుకు యూఏఈ వెళ్లాడు. గత ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్ తరువాత అతడు మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. దీనికి తోడు రిటైర్మెంట్ తరువాత మొదటిసారి ఆడుతున్న టోర్నీ కావడంతో ధోనీపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ధోనీ ఆటను చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
Published by: Rekulapally Saichand
First published: September 10, 2020, 5:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading