జీవా, గ్రేషియా బెస్ట్ ఫ్రెండ్స్... ఇంతకీ ఎవరి కూతుర్లో తెలుసా...

Ziva and Gracia : ఓవైపు ఐపీఎల్ మ్యాచ్‌లు అదరగొడుతుంటే, మరోవైపు క్రికెటర్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 28, 2019, 12:28 PM IST
జీవా, గ్రేషియా బెస్ట్ ఫ్రెండ్స్... ఇంతకీ ఎవరి కూతుర్లో తెలుసా...
జీవా, గ్రేషియా (image : instagram)
  • Share this:
జనరల్‌గా వన్డే, టెస్ట్ మ్యాచ్‌ల్లో ప్లేయర్లే ఎక్కువగా కనిపిస్తారు. ధోనీ, కోహ్లీ వంటి ఒకరిద్దరి భార్యలు తప్ప... మిగతా ఎవరూ స్టేడియంలకు రారు. అలాంటిది ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగితే మాత్రం... చాలా మంది కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఐతే... ఈసారి ఐపీఎల్‌ సీజన్‌లో జీవా, గ్రేషియా అందర్నీ ఆకర్షిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షి, కూతురు జీవా ఇద్దరూ... చెన్నై టీమ్ ఆడే ప్రతి మ్యాచ్‌కీ వెళ్తూ... సందడి చేస్తున్నారు. తాజాగా చెన్నై మ్యాచ్‌కి వచ్చిన సురేశ్ రైనా భార్య ప్రియాంక చౌదరి, కూతురు గ్రేషియా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇక్కడే మరో విశేషం జరిగింది. ధోనీ కూతురు జీవా... రైనా కూతురు గ్రేషియా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ధోనీ, రైనా లాగే... వాళ్లిద్దరూ ఎక్కడ కలిసినా చక్కగా ఆడుకుంటున్నారు. అందరూ క్రికెట్‌లో మునిగితేలుతుంటే... ఆ పిల్లలు మాత్రం తమదైన లోకంలో మునిగిపోతున్నారు.

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మంగళవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. ‘కమాన్.. పాప్పా’ అంటూ జీవా చీర్స్ చెప్పింది. ఆ తర్వాత... గ్రేషియాతో కలిసి ఆడుకుంది. అది చూసిన ఫ్యాన్స్ ముచ్చటపడుతూ వాళ్లిద్దర్నీ ఫొటోల్లో బంధించారు. ఇన్‌స్టాగ్రాంలో రైనా అప్‌లోడ్ చేసిన ఈ ఫొటో వైరల్ అయ్యింది. దీనికి రైనా బెస్టీ అనే క్యాప్షన్ పెట్టాడు.


 View this post on Instagram
 

#Reunited @priyankacraina ❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰


A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

జీవా ధోనీ ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో కూడా ఈ ఫొటోలు షేర్ అయ్యాయి. రీ యునైటెడ్ పేరుతో క్యాప్షన్ ఇచ్చారు.

తాజా మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్... ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించారు. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఉన్న సూపర్ కింగ్స్‌కి ఇది రెండో వరుస విజయం. నెక్ట్స్ మ్యాచ్ మార్చి 31న రాజస్థాన్ రాయల్స్‌తో జరగనుంది.

 

ఇవి కూడా చదవండి :

మసూద్ అజార్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలి... ఐరాసలో అమెరికా ప్రతిపాదన

ఇన్ఫోసిస్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల... అమ్మాయిల ఫొటోలు, డబ్బులు అడుగుతూ...

యాపిల్‌తో ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలిస్తే తినకుండా ఉండరు


లవంగాలు మనకు ఎంత మేలు చేస్తున్నాయో తెలుసా... ఎన్ని ప్రయోజనాలో... రోజూ తినాల్సిందే.
First published: March 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>